రెండు రోజుల క్రితం తిట్లు, పరుష పదాలు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ తెలంగాణ సర్కారు హుకూం జారీ చేసింది. చట్టాలకు పదును పెట్టింది. ఉన్న చట్టాలను సవరించింది. నోరు చేతబట్టుకుంటే ఎంతటివారినైనా కేసు పెట్టి లోపలేస్తామని ఇండికేషన్ ఇచ్చింది.

కానీ తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఈ హెచ్చరికలు లైట్ తీసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా మద్దూర్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం కేసిఆర్ ఉద్యోగం ఆరు నెలల్లో ఊసిపోతదని జోస్యం చెప్పారు. అంతేకాకుండా మరింత ఘాటుగా కేసిఆర్ పై వ్యక్తిగత విమర్శలు గుప్పించారు. రేవంత్ మాట్లాడిన వీడియో కింద ఉంది. చూడండి.