ఈ నెల 6 నుండి రేవంత్ రెడ్డి పాదయాత్ర: ములుగు నుండి ప్రారంభం

ఈ నెల  6వ తేదీన ములుగు  నుండి  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రను నిర్వహించనున్నారు.  తొలి విడతలో  50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  యాత్ర నిర్వహించేలా ప్లాన్  చేశారు రేవంత్ రెడ్డి.
 

Revanth Reddy To Start Padayatra From Mulugu on February 06

హైదరాబాద్: ఈ నెల  6వ తేదీ నుండి  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  ములుగు నుండి పాదయాత్రను ప్రారంభించనున్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ  మాణిక్ రావు ఠాక్రే  ఈ యాత్రను ప్రారంభించనున్నారు.  60 రోజుల పాటు  తెలంగాణలోని  50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  రేవంత్ రెడ్డి  పాదయాత్ర నిర్వహించేలా ప్లాన్  చేశారు.  తొలి విడత  యాత్ర పూర్తి చేసిన తర్వాత  రెండో విడత  పాదయాత్రను   చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.   గత నెల  చివరి వారం నుండి పాదయాత్ర  చేయాలని రేవంత్ రెడ్డి ప్లాన్  చేసుకున్నారు.  కానీ  కొన్ని కారణాలతో  పాదయాత్ర  ప్రారంభం కాలేదు.  అయితే  ములుగు నుండి పాదయాత్రను ప్రారంభించాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. 

 రేవంత్ రెడ్డి  పాదయాత్రకు  పార్టీ నాయకత్వం అనుమతి లేదని ఇటీవలనే ఆ పార్టీ సీనియర్ నేత మహేశ్వర్ రెడ్డి  ప్రకటించిన విషయం తెలిసిందే.  అయితే  యాత్ర నిర్వహణపై  రేవంత్ రెడ్డి  ఏర్పాట్లు  చేసుకుంటున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ ఠాక్రే కూడా   యాత్ర ప్రారంభించేందుకు  వస్తారని  సమాచారం. ఈ యాత్ర ప్రారంభించేందుకు రావాలని ప్రియాంక గాంధీని కూడా రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

తెలంగాణలో  వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని  ఆ పార్టీ నాయకత్వం ప్లాన్  చేసింది.  సునీల్ కనుగోలును  వ్యూహకర్తగా  కూడా  కాంగ్రెస్ పార్టీ నియమించింది.   ఈ ఏడాది చివర్లో  తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios