హైదరాబాద్: విద్యార్థుల సమస్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మాట్లాడితే ఆయనను ఓ కుర్రకుంక( కేటీఆర్) బఫూన్ అంటున్నారని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.

ఇంటర్  పరీక్ష ఫలితాలపై గురువారం నాడు గాంధీ భవన్‌లో ఎన్ఎస్‌యూఐ , యూత్ కాంగ్రెస్ నేతలు 48 గంటల దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు రేవంత్ రెడ్డి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

20 ఏళ్లుగా ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తున్న సంస్థను తప్పించిన కేటీఆర్..... తన స్నేహితుడి సంస్థ గ్లోబరీనా సంస్థకు టెండర్ ఇప్పించారని ఆరోపించారు. తెలంగాణ ఎంసెట్ లీకేజీ వ్యవహారంలో ఇంతకూ చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.కేటీఆర్ ఫ్రెండ్ మామకు చెందిన మాగ్నటిక్ ఇన్పోటెక్ విసయంలో ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు.