Asianet News TeluguAsianet News Telugu

నేను సీఎం కాకపోయినా కాంగ్రెస్ అధికారంలో రావాలి.. కేసీఆర్‌కు ఆ నొప్పేంటో ఇప్పుడు తెలుస్తోంది: రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాండూరులో తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేని కొనుగోలు చేసిన దరిద్రుడు నువ్వే కదా అంటూ కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Revanth Reddy Sensational Comments on KCR
Author
First Published Dec 5, 2022, 3:24 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాండూరులో తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేని కొనుగోలు చేసిన దరిద్రుడు నువ్వే కదా అంటూ కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇతర పార్టీల్లో గెలిచిన 37 మంది ఎమ్మెల్యేలను  కొనుగోలు చేసింది కూడా నువ్వే కదా అని మండిపడ్డారు. ధరణి, భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలనే డిమాండ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వికారాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంతో మంది ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కూడా ఇతర పార్టీ నుంచి కేసీఆర్ టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని అన్నారు. అలాంటింది కేసీఆర్ ఇప్పుడేమో వగల ఏడుపు ఏడుస్తున్నాడని ఎద్దేవా చేశారు. 

కాంగ్రెస్ లేకుంటే చేస్తే కేసీఆర్‌కు, ఆయన కొడుకుకు ఎదురు ఉండదని  అనకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ ఆవు లాంటి  పార్టీని మోసం చేశారని.. ఆ పాపం ఊరికే పోదని అన్నారు. ఆరోజు తనను అన్యాయంగా జైల్లో పెట్టారని అన్నారు. తన బిడ్డ లగ్నపత్రికకు కూడా వెళ్లకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కేసీఆర్ బిడ్డ ఇంటికి సీబీఐ వచ్చిందని అన్నారు. ఇవాళ కేసీఆర్ బిడ్డ ఇంటికి ఆ నొప్పేంటో ఆయనకు తెలుస్తుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ చీలికలు, పేలికలుగా పోతుందని విమర్శించారు. 

తాను సీఎం అయినా, కాకపోయినా.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని అన్నారు. కేసీఆర్ ఎన్నికల కోసం తొందరపడుతున్నారని.. కాంగ్రెస్ కార్యకర్తలంతా ఎన్నికలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ ముందు ఇక డిమాండ్స్ పెట్టేది లేదన్నారు. ఎవరి ఇంటిముందుకెళ్లి బిచ్చం అడగాల్సిన అవసరం లేదని కామెంట్ చేశారు. 

టీఆర్ఎస్, బీజేపీలలోప్రజాసమస్యలపై మాట్లాడే నాయకులు లేరని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉన్నవారిని వారంలో తీహార్  జైల్లో వేయాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే కేంద్రాన్ని అడ్డుకునే వారు ఎవరున్నారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కవితను, రాష్ట్ర ప్రభుత్వం బీఎల్ సంతోష్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లాంటి జాతీయ నేతలే నిజాయితీగా ఈడీ విచారణకు హాజరయ్యారని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఎందుకు విచారణకు హాజరుకావట్లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఎల్ సంతోష్‌ కూడా సిట్ ముందు ఎందుకు విచారణకు హాజరుకావడం లేదని ప్రశ్నించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios