Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ రెడ్డి మొదటి టార్గెట్ కేసీఆర్ కాదా?

మల్లారెడ్డి కూడా రేవంత్ రెడ్డి మినిస్టర్ గా ఉన్నప్పుడే తనను తీవ్రంగా ఇబ్బందులు పెట్టాడని, నిద్రలేని రాత్రుళ్లు గడిపానని ఓ సందర్భంలో అన్నారు. ఇప్పుడు ఏకంగా రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాడు. మరి మల్లారెడ్డిని ఈజీగా వదులుతాడా? 

Revanth Reddy's first target is not KCR? - bsb
Author
First Published Dec 8, 2023, 7:28 AM IST

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన అధికారంలోకి రాకముందే తనను అనేక రకాలు రాజకీయాల్లోకి రాకుండా ఇబ్బంది పెట్టిన వారిని అంతుచూస్తా అంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో ఆల్రెడీ స్పెషల్ ఇంటిలిజెన్స్ ఓఎస్ డీ ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. కానీ అన్ని లెక్కలు తేలందే ఎవ్వరి రాజీనామాలు అంగీకరించేది లేదంటూ రేవంత్ బల్ల గుద్ది చెబుతున్నారు.

అయితే, ఇక్కడ ఇది కాదు విషయం.. రేవంత్ రెడ్డికి ప్రభాకర్ రెడ్డికంటే ముఖ్యమైన టార్గెట్ లు ఉన్నాయి. అందరూ అనుకున్నట్లుగా ఆయన మొదటి టార్గెట్ కేసీఆర్ కాకపోవచ్చు ఆయన మొదటి టార్గెట్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడానికి దయాకర్ రావు నమ్మక ద్రోహం, మిత్రద్రోహమే కారణం అని ఎన్నోసార్లు మండిపడ్డారు. 

2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటుకు నోటు కేసు వెలుగు చూసింది. ఆ సమయంలో టీడీపీకి మద్ధతు తెలపాలని రేవంత్ రెడ్డి నామినేటెడు ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ మద్దతును కోరారు. ఆ సమయంలో 50 లక్షలు సూట్ కేసులో ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా కెమెరాకు చిక్కారు. ఈ కేసులో రేవంత్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి, కొద్ది రోజులు జైల్లో పెట్టారు. దీంతో రేవంత్ రాజకీయ జీవితం అయిపోయిందనే అందరూ అనుకున్నారు. ఆ తరువాతి పరిణామాలు కూడా అలాగే జరిగాయి. 

ఆ కేసు వల్ల రేవంత్ రెడ్డి తన కూతురి పెళ్లికి కూడా పూర్తి స్థాయిలో హాజరు కాలేకపోయారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా, ఎమోషనల్ గా ఇది ఆయనకు చాలా దెబ్బ. దీనికి ప్రధాన కారణం ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆయన బీఆర్ఎస్ నాయకులతో చేతులు కలిపి.. ఇన్ఫర్మేషన్ లీక్ చేసి దీనికి పాల్పడ్డాడని రేవంత్ ఎన్నోసార్లు ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో ఎర్రబెల్లి అక్రమాలు, అన్యాయాలే టార్గెట్ గా ఈ విషయాన్ని పదే పదే ప్రచారం చేశారు. ఇప్పుడిక ఎర్రబెల్లిపై టార్గెట్ ఎలా ఉంటుందో చూడాలి. 

ఇక రేవంత్ రెడ్డి నెక్ట్ట్స్ టార్గెట్ మాజీ మంత్రి మల్లారెడ్డి. మేడ్చల్ నుంచి ప్రస్తుతం మల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ గత కొద్దిసంవత్సరాలుగా మల్లారెడ్డి, రేవంత్ రెడ్డిల మధ్య నడుస్తున్న ప్రత్యక్ష, పరోక్ష యుద్ధాలు తెలిసిందే. బహిరంగంగా సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకున్నారు. తొడలు కొట్టుకున్నారు... కార్యకర్తలతో దాడులకు దిగారు. మాటల యుద్ధంతో కాకలు పుట్టించారు. 

రాజకీయాల్లో ఎన్నడూ, కనీ, వినీ ఎరుగని రీతిలో బూతులతో మాటలు విసురుకున్నారు.మరోవైపు మల్లారెడ్డిపై భూ ఆక్రమణలు, అవినీతికి సంబంధించి అనేక ఫిర్యాదులు ఉన్నాయి. వీటన్నింటిపై ఉచ్చు బిగించే అవకాశం ఉంది. ఇక మల్లారెడ్డి కూడా రేవంత్ రెడ్డి మినిస్టర్ గా ఉన్నప్పుడే తనను తీవ్రంగా ఇబ్బందులు పెట్టాడని, నిద్రలేని రాత్రుళ్లు గడిపానని ఓ సందర్భంలో అన్నారు. ఇప్పుడు ఏకంగా రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాడు. మరి మల్లారెడ్డిని ఈజీగా వదులుతాడా? వీటన్నింటి నేపథ్యంలో టార్గెట్ మల్లారెడ్డే... రేవంత్ రెండో ఆప్షన్ అనుకోవచ్చు. 

ఆ తరువాతే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ. వీరిని మాత్రం రేవంత్ రెడ్డి మామూలుగా చూసుకోడు అనేది టాక్. ఇప్పటికే 2014 నుంచి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు, తెచ్చిన అప్పులు, లెక్కల మీద శ్వేతపత్రం విడుదల చేయాలని తెలిపారు. దీంతో అసలు వార్ మొదలయ్యింది. కానీ ప్రతిపక్షంలో ఉన్నది. ఆయన వేసే ఎత్తుల ముందు కాకలుతీరిన వారికే ముచ్చెమటలు పట్టిస్తాడు. మరి రేవంత్ రెడ్డి వీటిని కరెక్టుగా తిప్పికొట్టి.. తన సత్తా చాటుకుంటాడా? వీరి యుద్ధంతో తెలంగాణకు న్యాయం కలుగుతుందా? నష్టపోతుందా? రానున్న రోజుల్లో  వీరిద్దరి పోరు ఎలా ఉండబోతోందో వేచి చూడాల్సిందే. 
 

Follow Us:
Download App:
  • android
  • ios