హైదరాబాద్: భారత్ బంద్ లో భాగంగా  మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ లో మంగళవారం నాడు దీక్షకు దిగారు. ఈ దీక్ష శిబిరం పక్కనే ఉన్న కారు దగ్దం కావడంతో కార్యకర్తలు కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.

also read:బ్రిటన్ ప్రధాని స్పందించారు, మన ప్రధానికి ఏమైంది: రైతుల ఆందోళనలపై హరీష్ రావు

రైతులకు మద్దతుగా రేవంత్ రెడ్డి షాద్‌నగర్ లో దీక్షకు దిగాడు. ఈ దీక్ష చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాణాసంచా కాల్చారు. బాణాసంచా పేలడంతో నిప్పు రవ్వలు లేచి కారుపై పడ్డాయి.దీంతో కారు దగ్దమైంది. కారు దగ్దం కావడంతో  దీక్ష శిబిరం వద్ద కొద్దిసేపు ఏం జరుగుతోందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. కారులో చెలరేగిన మంటలను వెంటనే ఆర్పారు.

దీక్ష శిబిరం పక్కనే ఉన్న కారు దగ్దం కావడంతో  కొద్దిసేపు కార్యకర్తల్లో భయపడ్డారు.ఫైరింజన్ వచ్చేలోపుగా కారు పూర్తిగా దగ్ధమైంది.