తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రేతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రేతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పర్యటనపై చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరికలపై నేతలు మంతనాలు జరిపారు.
Also Read: నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్‌కు షాక్.. రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన సారంగపూర్ జెడ్పీటీసీ..
ఇటీవల మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఇరువురు నేతలతో కాంగ్రెస్ నాయకులు టచ్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరిని పార్టీలో చేర్చుకోవడం.. అందుకు వారిని ఒప్పించే అంశాలపై కూడా ఈ సమావేశంలో ఠాక్రే, రేవంత్, ఇతర ముఖ్య నేతల మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. మరోవైపు పొంగులేటి, జూపల్లిలకు బీజేపీ నేతలు కూడా గాలం వేస్తున్న సంగతి తెలిసిందే.
