కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణలో సీఎంఆర్ పేరుతో ధాన్యం స్కాం జరిగిందని ఆ లేఖలో ఆరోపించారు. బియ్యం రీ సైక్లింగ్‌పై సీబీఐ విచారణ జరపాలని కోరారు. 

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణలో సీఎంఆర్ పేరుతో ధాన్యం స్కాం జరిగిందని ఆ లేఖలో ఆరోపించారు. ఎఫ్‌సీఐ గోదాముల్లో మాయమైన బియ్యం సీబీఐ విచారణ చేయించాలని కోరారు. తెలంగాణలో ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్, ధాన్యాన్ని ఎఫ్‌సీఐకి సరఫరా చేయడంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ముఖ్యులు రైస్ మిల్లర్లతో కుమ్మకయ్యారని ఆరోపించారు. ప్రతి ఏటా రూ. 100 కోట్ల ధాన్యం స్కామ్‌కు పాల్పడుతున్నారని అన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు సీఎంఆర్ కేటాయింపులపై విచారణ జరపాలన్నారు. అక్రమ మిల్లులను సీజ్ చేసి దోపిడి సొమ్ము వసూలు చేయాలని కోరారు. 

ఇక, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయకులు బుధవారం రాష్ట్ర గవర్నర్‌ను కలిసి పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. 111జీవో, పంట అమ్మిన రైతులకు నష్ట పరిహారం, విద్యుత్ చార్జీల పెంపు, డ్రగ్స్, మూసీ కాలుష్యంపై గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలోని రైస్‌ మిల్లుల నుంచి ఎఫ్‌సీఐకి చేరాల్సిన రూ.2,600 కోట్ల విలువైన 8.34 లక్షల టన్నుల బియ్యం మాయమయ్యాయని ఆరోపించింది. బియ్యం ఎఫ్‌సీఐకి రాలేదంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డే ప్రకటించారని గుర్తుచేసింది. ప్రభుత్వం డిస్కంలకు బకాయిలు ఉండి.. విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం వేస్తోందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం 8 లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సిఐకి అందజేయకపోవడం, ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయడంతో రైస్‌మిల్లర్లు అధికారులతో చేతులు కలిపి రైతుల నుంచి ఎంఎస్‌పీ కంటే చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయడంపై సీబీఐ విచారణ జరరిపించాలని గవర్నర్‌ను కోరారు.

గవర్నర్‌ను కలిసిన అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రైతుల సమస్యలు, తెలంగాణ ప్రభుత్వ అవకతవకలపై గవర్నర్‌కు నివేదిక ఇచ్చినట్టుగా చెప్పారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యం చేయడం వల్ల రైతులు పండించిన ధాన్యంలో 30 శాతాన్ని మిల్లరు తక్కువ రేటుకే కొనుగోలు చేశారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. దీని వల్ల రైతులకు రూ. 2 వేల కోట్ల నష్టం వచ్చిందని చెప్పారు. ఏ రైతు ఎంత ధాన్యం అమ్మారో మిల్లర్ల దగ్గర వివరాలు ఉన్నాయని అన్నారు. ఆ రైతులు నష్టపోయిన సొమ్మును ప్రభుత్వం ద్వారా ఇప్పించాలని గవర్నర్‌ను కోరామని చెప్పారు. వడ్లు-బియ్యం మాయం చేసిన వాళ్లపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. 

20 లక్షల ఎకరాల్లో పంట వేయని రైతులకు ఎకరాకు రూ. 15 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ధాన్యం కొనుగోళ్లలో గోల్ మాల్ చేసిన అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్ రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని ఆరోపించారు.