తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి. తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఆయన మీడియాతో మాట్లాడారు.. నాలుగున్నరేళ్ల పాలనలో కేసీఆర్ ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేశారని ఆరోపించారు.

విద్యార్థులను వీధుల్లోకి వదిలేయడం, రైతుల ఆత్మహత్యలు ఆపలేకపోవడం, సామాజిక న్యాయం జరగకపోవడం, ఆత్మగౌరవాన్ని లెక్క చేయకపోవడం, దళిత, గిరిజన, మైనారీటలను ఎన్నో రకాలుగా వేధింపులకు గురిచేశారన్నారు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 70 ఏళ్లలో పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు సచివాలయ వ్యవస్థకు గట్టి పునాదులు పడ్డాయన్నారు. కానీ కేసీఆర్ సీఎం అయ్యాకా సచివాలయానికి రాకుండా పాలనను గాలికొదిలేశారని రేవంత్ ఆరోపించారు. అదే సాంప్రదాయాన్ని టీఆర్ఎస్ మంత్రులు అనుసరించడం వల్ల ప్రజల్లో ప్రభుత్వం పట్ట విశ్వాసం సన్నగిల్లిందన్నారు.