Asianet News TeluguAsianet News Telugu

కుట్రతోనే GO 317 తెచ్చారు.. జీవోలో తప్పుంటే దాన్ని ఆమోదించింది ఎవరు?.. రేవంత్ రెడ్డి

కొత్త జోన్లపై కేసీఆర్ పంపిన ప్రతిపాదనలకే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. కుట్రతోనే 317 జీవో (GO No 317)  తీసుకొచ్చారని ఆరోపించారు. 317 జీవో అమలు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తప్పు కూడా ఉందని ఆరోపించారు. 

Revanth Reddy Fires on BJP And TRS over Go 317
Author
Hyderabad, First Published Jan 10, 2022, 5:03 PM IST

కొత్త జోన్లపై కేసీఆర్ పంపిన ప్రతిపాదనలకే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. కుట్రతోనే 317 జీవో (GO No 317)  తీసుకొచ్చారని ఆరోపించారు. 317 జీవో అమలు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తప్పు కూడా ఉందని ఆరోపించారు.  జీవోలో తప్పు ఉందంటే.. ఆ తప్పును ఆమోదించింది ఎవరని రేవంత్ ప్రశ్నించారు. సోమవారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 317 జీవోను ఎందుకు కొట్టివేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన తప్పును బీజేపీ ప్రోత్సహించిందని విమర్శించారు. 317 జీవో రాష్ట్రపతి ఉత్తర్వుల స్పూర్తికి విరుద్దంగా ఉంది. 

కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు కేసీఆర్ సుపారీ రాజకీయాలను చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తికి విరుద్దంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ రాజకీయాల్లో రోజుకో వీధి బాగోతం జరుగుతుందన్నారు. చైనా విగ్రహాలను ప్రారంభించి.. మేకిన్ ఇండియా.. మేడిన్ ఇండియా నినాదాలు ఇచ్చే బీజేపీ నేతలు కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. 

‘రాష్ట్రపతి ఉత్తర్వుల స్పూర్తికి విరుద్దంగా ఇచ్చిన ఈ జీవోను తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆపొచ్చని అన్నారు. కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల పరిధిలో లోబడి రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాల్సిన అవరసం ఉందని అన్నారు. జోనల్ విధానంలో నియమాకాలు, బదిలీలు, పదవీ విరమణలు.. రాష్ట్రపతి పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన విషయాలు. ఇందులో మార్పులు చేర్పులు రాష్ట్ర ప్రభుత్వం చేయాలంటే.. కేంద్ర మంత్రివర్గం ఉండాలి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. కేంద్రంలో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి.. కేసీఆర్ పంపిన ప్రతిపాదనలను గుడ్డిగా ఆమోదించారు. ఆ ఉత్తర్వుల మేరకు కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే బీజేపీ నేతలు పోరాటం చేస్తున్నామని ప్రజలను మభ్యపెడుతున్నారు’ అని రేవంత్ విమర్శించారు. 

సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగుల్లో చీలిక తెచ్చారని ఆరోపించారు. చెరో వర్గాన్ని మచ్చిక చేసుకుందామని బీజేపీ, టీఆర్‌ఎస్‌లు కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. 
బండి సంజయ్ పార్టీ కార్యాలయంలో రాత్రి నిద్ర చేస్తే టీఆర్‌ఎస్‌కు అభ్యంతమేమిటని ప్రశ్నించారు. 24 గంటల్లో ముగిసిన తంతంగాన్ని 10 రోజులుగా సాగదీస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు ఫిర్యాదు చేస్తే.. 317 జీవో మీద అవసరమైన ఆదేశాలు రాష్ట్రపతి చేత ఇప్పించొచ్చని అన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు కలిసి ప్రజలు మభ్యపెడుతున్నాయని విమర్శించారు. 

జాతర్లలో గంగిరెద్దుల మాదిరిగా దేశంలోని బీజేపీ నేతలు తెలంగాణకు ఎందుకు వస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. బండి సంజయ్ ఏం సాధించారని వారు ఇక్కడకి వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.  ఇందిరా గాంధీ గురించి మాట్లాడే అర్హత అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ‌కు లేదన్నారు. కాంగ్రెస్‌లో రాజకీయంగా ఎదిగిన హిమంత బిశ్వ శర్మ.. బీజేపీలో చేరి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios