తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023: కొడంగల్ నుండి రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇంకా కొన్ని స్థానాల్లో  అభ్యర్ధులను  పార్టీలు ప్రకటించాల్సిన పరిస్థితులున్నాయి. 

Revanth reddy files nomination from Kodangal Assembly Segment lns


హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు  ప్రముఖులు సోమవారంనాడు తమ నామినేషన్లను దాఖలు చేశారు.  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు కాంగ్రెస్ కార్యకర్తలనుద్దేశించి రేవంత్ రెడ్డి  ప్రసంగించారు. అనంతరం  రిటర్నింగ్ అధికారికి  రేవంత్ రెడ్డి  తన నామినేషన్  పత్రాలను అందించారు.   ఈ నెల  10న కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి  రేవంత్ రెడ్డి  నామినేషన్ దాఖలు చేయనున్నారు.  కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి కేసీఆర్ పై  రేవంత్ రెడ్డి  బరిలోకి దిగుతున్నారు.

నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా  షబ్బీర్ అలీ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. షబ్బీర్ అలీ తరపున  ఆయన తనయుడు  ఇవాళ నామినేషన్ వేశారు.గతంలో కామారెడ్డి నుండి  షబ్బీర్ అలీ  పలు దఫాలు విజయం సాధించారు. కామారెడ్డి నుండి కేసీఆర్ పోటీ చేస్తున్నందున  రేవంత్ రెడ్డిని బరిలోకి దింపుతుంది ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం.

పాలకుర్తి అసెంబ్లీ స్థానం నుండి  నామినేషన్ దాఖలు చేశారు ఎర్రబెల్లి దయకార్ రావు . పాలకుర్తి నుండి  2009 నుండి  దయాకర్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అంతకుముందు ఆయన  వర్ధన్నపేట నుండి ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.  పలు దఫాలు ఆయన టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు.  2018 ఎన్నికల్లోనే ఆయన తొలిసారిగా  బీఆర్ఎస్ అభ్యర్ధిగా  గెలుపొందారు.

 

కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కు ముందు  కరీంనగర్ లో  బండి సంజయ్ ర్యాలీ నిర్వహించారు.  ఈ ర్యాలీలో  గోషామహల్ ఎమ్మెల్యే  రాజాసింగ్ కూడ పాల్గొన్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios