కరీంనగర్ లో రేవంత్ ఫ్యాన్స్ ఇలా రెచ్చిపోయిర్రు ఎందుకో ? (వీడియో)

కరీంనగర్ లో రేవంత్ ఫ్యాన్స్ ఇలా రెచ్చిపోయిర్రు ఎందుకో ? (వీడియో)

తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్ర హాట్ హాట్ గా సాగుతోంది. మంగళవారం కరీంనగర్ జిల్లాలోని మంథనిలో బస్సు యాత్ర సాగుతుండగా మంథని లో బహిరంగసభ జరిగింది. ఈ బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి తెలంగాణ సర్కారుపై మాటల యుద్ధం చేశారు.

సభ వేదిక మీద రేవంత్ రెడ్డి మాట్లాడే ముందు ఆయన ఫ్యాన్స్ ఈలలు, కేకలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతారు అని అనౌన్స్ మెంట్ వస్తూనే రేవంత్ అభిమానులు సభా ప్రాంగణంలో అలజడి సృష్టించారు. పెద్ద పెట్టున స్లోగన్స్, ఈలలు, అరుపులతో హల్ చల్ చేశారు.

గతంలో రంగారెడ్డి జిల్లాలోనూ రేవంత్ అభిమానులు రేవంత్ మాట్లాడతారని ప్రకటించగానే ఫుల్ జోష్ ప్రదర్శించారు. రంగారెడ్డి అంటే పాలమూరుకు పక్క జిల్లా కాబట్టి రేవంత్ కు అభిమానులు ఉండొచ్చు కాని.. కరీంనగర్ లో కూడా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ను రేవంత్ కలిగి ఉండడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమైందని చెబుతున్నారు. ఫ్యాన్స్ హంగామా వీడియో పైన ఉంది చూడండి.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos