ఒక కులమే కేసీఆర్ టార్గెట్... జగ్గారెడ్డి కంటే ముందు టార్గెట్ నేనే:రేవంత్

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 12, Sep 2018, 2:07 PM IST
revanth reddy comments on kcr
Highlights

తనపై వస్తున్న వార్తలపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నాడని.. తనకు ప్రత్యామ్నాయంగా ఉన్నవారిని కేసులతో భయపెట్టాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు

తనపై వస్తున్న వార్తలపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నాడని.. తనకు ప్రత్యామ్నాయంగా ఉన్నవారిని కేసులతో భయపెట్టాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు..

ఒక సామాజిక వర్గమే కేసీఆర్ అసలు టార్గెట్ అని .. వారిపై కేసులతో దాడి చేస్తున్నారని రేవంత్ విమర్శించారు. జగ్గారెడ్డి కంటే ముందు నన్ను టార్గెట్ చేశారని.. గండ్రపై అక్రమంగా కేసు పెట్టారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కీలక నేతలను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా అష్టదిగ్బంధం చేస్తున్నారని అన్నారు.

ఈ కేసులకు భయపడేది లేదని... చర్లపల్లి జైలులో 40 రోజులు ఉన్నానని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకా వడ్డీతో సహా బాకీ తీర్చుకుంటామని.. కేసీఆర్ మాట వింటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని.. అధికారుల పేర్లు డైరీలో రాసి పెడుతున్నామని రేవంత్ హెచ్చరించారు. 2001 నాటి జూబ్లీహిల్స్ హౌసింగ్ సోసైటీ కేసులో రేవంత్  రెడ్డి సహా 13 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

రేవంత్‌ రెడ్డికి షాక్: నోటీసులు జారీ చేసిన పోలీసులు

loader