Asianet News TeluguAsianet News Telugu

రేవంత్‌ రెడ్డికి షాక్: నోటీసులు జారీ చేసిన పోలీసులు

 కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు

Jubilee Hills police issues notice to congress leader revanth reddy
Author
Hyderabad, First Published Sep 12, 2018, 12:28 PM IST


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సోసైటీ కేసులో అవకతవకల కేసులో  ఈ నోటీసులు జారీ చేశారని సమాచారం. అయితే ఎన్నికల బిజీలో  ఉన్నందున తాను హాజరుకాలేనని పోలీసులు నోటీసులు జారీ చేశారు.


తప్పుడు పత్రాలతో ఇళ్ల స్థలాలు కేటాయించారనే విషయమై రేవంత్‌ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. 2001 జూబ్లీహిల్స్ హౌసింగ్ సోసైటీ కేసులో పోలీసులు  నోటీసులు జారీ చేశారు.

ఈ నోటీసులపై 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని రేవంత్ ను పోలీసులు కోరారు. అయితే  ఈ విషయమై రేవంత్ రెడ్డి పోలీసులకు సమాధానమిచ్చారు.ఎన్నికల బిజీలో ఉన్నందున తాను  హాజరుకాలేనని రేవంత్ రెడ్డి పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఈ కేసు విషయమై రేవంత్ రెడ్డితో పాటు  మరో 13 మందికి కూడ జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.

పాస్‌పోర్ట్ కేసులో జగ్గారెడ్డిని మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. తాజాగా రేవంత్‌కు పోలీసులు నోటీసులు జారీ చేయడంతో  కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఆందోళన  నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు  ఇబ్బంది పెడుతున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios