రాస్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అసోం సీఎం హిమంత బిశ్శశర్మపై  కేసు నమోదు చేయకపోవడంతో పోలీసు కార్యాలయాలను ముట్టడిస్తామని కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే.  

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలను బుధవారం నాడు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిరసన ప్రదర్శనలకు పిలుపునివ్వడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకొన్నారు. టీపీసీసీ చీఫ్ Revanth Reddy, భువనగిరి ఎంపీ Komati Reddy Venkat Reddy మాజీ మంత్రులు Shabbir Ali, జీవన్ రెడ్డి సహా పలువురు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. 

Congress పార్టీ మాజీ చీఫ్ Rahul Gandhi పై అసోం సీఎం Himanta Biswa Sarma చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అయితే ఈ ఫిర్యాదులపై Police స్పందించలేదు. కేసులు నమోదు చేయలేదు . దీంతో కాంగ్రెస్ పార్టీ ఇవాళ జిల్లాల ఎస్పీలు, ఆయా పోలీస్ కమిషనరేట్ల కార్యాలయాలను ముట్టడించాలని పిలుపునిచ్చింది. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను హౌస్ అరెస్టులు చేశారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి భారీగా పోలీసులను మోహరించారు పోలీసులు. హైద్రాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద రేవంత్ రెడ్డి, రాచకొండ కమిషనరేట్ వద్ద కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధర్నాకు దిగాలని నిర్ణయం తీసుకొన్నారు. దీంతో కాంగ్రెస్ నేతలను బయటకు రాకుండా పోలీసులు హాస్ అరెస్ట్ చేశారు. 

Uttarakhand Assembly Election 2022 ప్రచారంలో భాగంగా అసోం సీఎం ఈ నెల 11వ తేదీన రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 2016లో Pakistan పై జరిగిన Surgical Strike కు సంబంధించిన ఆధారాలను బయట పెట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.ఈ విషయమై హిమంత బిశ్వశర్మ స్నందించారు. రాహుల్ గాంధీ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ తనయుడే అని చెప్పడానికి ఆధారాలు అడగలేదు కదా అని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేగాయి. ఈ వ్యాఖ్యలను పలువురు ఖండించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. 

అసోం సీఎం హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఇచ్చారు. మోతీలాల్ నెహ్రు, జవహర్ లాల్ నెహ్రు, ఇందిరా గాంధీలు దేశం కోసం సేవ చేశారని ఈ ఫిర్యాదులో కాంగ్రెస్ నేతలు గుర్తు చేశారు. 1990 అక్టోబర్ 19న రాజీవ్ గాంధీ హైద్రాబాద్ లో సద్భావన యాత్రను నిర్వహించారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఐపీసీ 153 ఏ, 505(2), 294 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని కాంగ్రెస్ నేతలు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 730కి పైగా పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ పార్టీ నేతలు అసోం సీఎం పై ఫిర్యాదులు చేశారు. అయితే పోలీస్ కార్యాలయాల ముందు ధర్నాలతో ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉన్నందున కాంగ్రెస్ నేతలను ముందు జాగ్రత్తగా హౌస్ అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు ప్రకటించారు.