రేవంత్ సంచలన ఆరోపణ: కేటీఆర్ బావమర్దికి కేంద్రం కరోనా మందు కాంట్రాక్టు

కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందిన ఎటువంటి అర్హతలు లేని కంపెనీతో హైడ్రాక్సీ క్లోరోక్విన్ తయారీకి ముడిసరుకు అందించేందుకు కేంద్రం ఒప్పందం కుదుర్చుకుందని, కేటీఆర్ బావమరిది కావడమే అతనికున్న అర్హతనా? అని కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. 

Revanth Reddy Accuses Centre of giving hydroxychloroquin contract to KTR's brother in Law

కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందిన ఎటువంటి అర్హతలు లేని కంపెనీతో హైడ్రాక్సీ క్లోరోక్విన్ తయారీకి ముడిసరుకు అందించేందుకు కేంద్రం ఒప్పందం కుదుర్చుకుందని, కేటీఆర్ బావమరిది కావడమే అతనికున్న అర్హతనా? అని కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. 

ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతానని, ప్రధానికి లేఖ కూడా రాస్తానని వెల్లడించారు రేవంత్ రెడ్డి. నిన్న గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ....  20 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన సంస్థకు రాజ్‌ పాకాల డైరెక్టర్‌ అయ్యాకే ఆ కంపెనీకి 150కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆరోపించారు. 

రాష్ట్రంలో పేరొందిన ఫార్మా సంస్థలన్నింటినీ పక్కన పెట్టి.. ఇలాంటి గల్లీ సంస్థతో కేంద్రం ఎలా ఒప్పందం చేసుకుందని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం డబ్బులు ఇవ్వకున్నప్పటికీ... ఓపిక పడుతున్నాము అని కేటీఆర్ అంటుంటే... నిజమనుకున్నాను కానీ... ఈ వ్యాపార ఒప్పందం వల్లనే కేంద్రం తెలంగాణకు డబ్బులివ్వడం లేదన్న విషయం ఇప్పుడు అర్థమైందని రేవంత్ అన్నారు. 

ఢిల్లీలో బీజేపీ, తెరాస లు దోస్తీ చేస్తూనే... ఇక్కడ తెలంగాణ గల్లీల్లో మాత్రమే కుస్తీ పడుతున్నట్టు నటిస్తారనే విషయం మరోసారి అర్థమైందని రేవంత్ అన్నారు. పనిలో పనిగా బండి సంజయ్ కి కూడా ఒక ప్రశ్నను సంధించారు రేవంత్ రెడ్డి. 

ఇలాంటి ఒక గల్లీ సంస్థతో( కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు సంబంధించిన కంపెనీ) కేంద్రం ఒప్పందం చేసుకుందంటే... అది బీజేపీ, తెరాస లు కుమ్మక్కయినట్టు కాదా అని బండి సంజయ్ ని సూటిగా ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.

తెలంగాణలో గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసుల సంఖ్య గురువారం మళ్లీ పెరిగింది. ఇవాళ కొత్తగా 22 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 1038కి చేరింది. అలాగే ఇవాళ ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 28కి చేరింది.

గురువారం 33 మంది డిశ్చార్జ్ కావడంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 442కి చేరింది. దీంతో రాష్ట్రంలో 568 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది. 

Also Read:కరోనా లాక్ డౌన్: తెలంగాణాలో రెడ్, గ్రీన్ జోన్ల పూర్తి లిస్ట్ ఇదే...

మరోవైపు కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ అమలు తదితర పరిస్ధితులపై చర్చించేందుకు గాను ఈ నెల 5న తెలంగాణ మంత్రిమండలి సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఈ భేటీ జరగనుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios