Asianet News TeluguAsianet News Telugu

కేసిఆర్ పై ఇంకా చల్లారని రేవంత్ పగ

  • మళ్లీ డ్రగ్ విమర్శలు గుప్పించిన రేవంత్
  • కేసిఆర్ ఫ్యామిలీపై హాట్ కామెంట్స్
  • డ్రగ్ వ్యాపారంలో కేసిఆర్ కుటుంబం పాత్ర ఉంది
Revanth rakes up Old drug scandal to hit at kcr government

టిడిపిలో ఉన్నంత కాలం రేవంత్ రెడ్డి డ్రగ్ విషయాన్ని గట్టిగా లేవనెత్తే ప్రయత్నం చేసిండు. ఆ సమయంలో ఆయన ఏకంగా ముఖ్యమంత్రి ఫ్యామిలీ మీదనే తీవ్రమైన విమర్శలు గుప్పించిండు. సిఎం తనయుడు, మంత్రి అయిన కేటిఆర్ బామ్మార్ది డ్రగ్ మాఫియా కింగ్ గా అవతారమెత్తిండని విమర్శలు గుప్పించిండు. ఆయనతోపాటు ఆయన సతీమణి కూడా డ్రగ్ మాఫియా క్వీన్ అవతారమెత్తినట్లు ఆరోపించిండు.

అదంతా గతం.. మరి ఇప్పుడేందంటారా? ఇప్పుడు రేవంత్ టిడిపి లీడర్ కాదు.. కాంగ్రెస్ లీడర్. అయినా ఆయన పాత పంతం వీడేలా లేదు. పార్టీ మారొచ్చు కానీ పంతం, పగ, పోరాటం మాత్రం మారలేదని చెబుతున్నారు. అందుకే మళ్లీ డ్రగ్ కేసును బయటకు తెస్తున్నాడు. తాజాగా బుధవారం రేవంత్ రెడ్డి తన నివాసంలో మీడియాతో చిట్ చాట్ చేసిండు. ఈ సందర్భంగా డ్రగ్ అంశాన్ని పదే పదే లేవనెత్తిండు. దానిపై తెలంగాణ సర్కారును వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేసిండు. ఇంకా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో చదవండి.

డ్రగ్స్ పై చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అని మధ్య తరగతి విద్యార్థుల తల్లి తండ్రులు సంతోష పడ్డారు.. కానీ వారిని నమ్మించి గొంతు కోసింది సర్కారు. మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పబ్బులకి అనుమతించడం, పబ్బులలో డ్రగ్స్ చలామణి అవడంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్1 అయింది. డ్రగ్స్ సరఫరా కి సహకరించిన వారిలో సీఎం కెసిఆర్ బంధువులే ప్రధానంగా ఉన్నారు. 

Sunburn పార్టీలకి గోవా ప్రధాన కేంద్రం కానీ అటువంటి చోట Sunburn ,రేవ్ పార్టీలను గోవా ప్రభుత్వం రద్దు చేసింది. మాదక ద్రవ్యాలను నియంత్రించలేక పోతున్నాం అని ఇలాంటి పార్టీలను గోవా ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు ఇలాంటి పార్టీలను మంత్రి కేటీఆర్ స్వయంగా గచ్చోబౌలి లో పెట్టుకోవడానికి అనుమతించాడు. కేటీఆర్ సొంత బావమర్ది ఈ ఈవెంట్ ల టికెట్ లను అమ్మారు. ఇలాంటి పార్టీలకి స్వయానా కేటీఆర్ కూడా అనేక సార్లు వెళ్ళాడు. Trs ప్రభుత్వం వచ్చాక 59 పబ్బులకి పర్మిషన్లు ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు వుంటేనే ఐటీ కంపెనీలు వస్తాయని కేటీఆర్ చెప్తున్నారు. మాదక ద్రవ్యాల సరఫరాకు ప్రభుత్వమే సహకరిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలకి ప్రభుత్వం ఎందుకు అనుమతిస్తుందో చెప్పాలి.

ఈ నెల 24 సాయంత్రం 5గంటలకి గచ్చిబొలి స్టేడియం లో పోలీసుల పహారాలో sunburn ఈవెంట్ జరగనుంది. క్రిడా మైదానాలను డ్రగ్స్ మైదానాలుగా తీర్చిదిద్దుతుంది ఈ ప్రభుత్వం. 2499 నుండి 3లక్షల 84వేల వరకు ఒక్కో టికెట్ అమ్ముతున్నారు. ఆగస్ట్ 7 న గోవా లో ఇలాంటి కార్యక్రమం ప్రభుత్వం అనుమతిలేకుండా నిర్వహించి ఇద్దరు మరణించారు. ఎవరి వత్తిడి మేరకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోందో ఈ ప్రభుత్వం చెప్పాలి.

కెసిఆర్ మనవడు చదివే స్కూల్ లో కూడా డ్రగ్స్ వాడుతున్నారని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ అంశం పై కెసిఆర్ సమాధానం చెప్పాలి.. సమీక్ష చేయాలి. మధ్యతరగతి వారు హైదరాబాద్ లో బతికే పరిస్థితి లేదు. హైదరాబాద్ ను అడ్డాగా చేసుకుని వాడుకుంటున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ప్రమాద కరమైన అంశం ఇది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఇలాంటి పార్టీలకు 15సంవత్సరాలు వున్న మయినర్లకు కూడా అనుమతి వుంది. నిర్వాహకుల పై చర్యలు తీసుకోకుండా సహకరించడంలో ఆంతర్యమేంటి? బాధ్యతా రహితంగా ప్రభుత్వం పనిచేస్తున్నది. ఇలాంటి పబ్, డ్రగ్స్ కోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? ఇలాంటి పాలన కోసమేనా మేధావులు, విద్యార్థులు ప్రత్యెక తెలంగాణ కోసం పోరాడింది.

 రోడ్ no36 లో వున్న పబ్(హై లైఫ్) ఉదయం 5గంటల వరకి పనిచేస్తుంది. పోలీసులు, ఎక్సయిజ్ వ్యవస్థ ప్రభుత్వానికి లొంగి సహకరిస్తున్నారు. ఇలాంటి ఈవెంట్ ల వలన ప్రభుత్వంలో వున్న పెద్దలకు, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత? ఈ అంశానికి వున్న ప్రధాన్యత, సమాజం పట్ల వున్న గౌరవం తోనే మీడియా ప్రతినిధుల ముందుకు వచ్చాను. డిసెంబర్ 9నుండి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తాను.

Follow Us:
Download App:
  • android
  • ios