జనగర్జనలో కేటిఆర్ పై రేవంత్ బూతు పురాణం

Revanth objects to ktr representing women in ivanka meeting
Highlights

  • జడ్చర్ల జనగర్జనలో తిట్లవర్షం
  • ఇవాంకనూ వివాదంలోకి గుంజిన రేవంత్
  • గొర్రెలు, బర్రెలు, చీరల కోసమేనా ఆత్మహత్యలు చేసుకున్నది

జడ్చర్ల జనగర్జన సభలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కేసిఆర్ ఫ్యామిలీపై మరోసారి విమర్శల వర్షం కురిపించారు. విమర్శల వర్షమే కాదు బూతు పురాణం ఎత్తుకున్నారు. మంత్రి కేటిఆర్ లక్ష్యంగా బూత పదజాలంతో దూషించాారు.. జనగర్జన సభలో రేవంత్ ఏం మాట్లాడిండో  కింద చదవండి.

కేటిఆర్ నువ్వు ఇవాంక  ప్రోగ్రామ్ కు పోయినవు. బానే ఉంది కానీ.. నువ్వు ఆడనా మాడనా జవాబు చెప్పు. అప్పుడు డబ్బా ఇండ్లు వద్దన్న కెసిఆర్ .. ఆయన ఇస్తానన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎటు పోయినయో చెప్పాలి. పేదోడికి ఇల్లు లేదు కానీ... నువ్వు మాత్రం వందల కోట్ల తో పంజాగుట్ట లోదొర గడి కట్టుకున్నావు. ఎన్నికల ముందు ఇండ్లు అని ఊరించిన కేసిఆర్ ఊరికో కోడి ఇంటికో ఈక కూడా ఇవ్వలేదు. 

కాంగ్రెస్ కాల్వలు తవ్వితే ,,ఇప్పుడు టీఆరెస్ నేతలు ఫోటోలకు ఫోస్ లు ఇస్తున్నారు. తెలంగాణ ప్రజల నుంచి పన్నుల రూపంలో వస్తున్న రాబడిని కేసీఆర్ కుటుంబం విలాసాలకు వాడుకుంటున్నది. తెలంగాణ కోసం అప్పుడు బలిదానా లు చేసింది కెసిఆర్ కుటుంబం కోసమేనా జనాలు ఒకసారి ఆలోచన చేయాలి. నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలని ఒకే ఇంటికి చెందిన నలుగురు కలిసి పీడిస్తున్నారు. చేపలు, బర్రెలు, గొర్రెలు, చీరెల కోసం తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానాలు చేసుకున్నరా? జవాబు చెప్పాలి. 

ఎన్నికల ముందు టిఆర్ఎస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుచేయడం లేదు. ఒక్క ఆడబిడ్డ కూడా తెలంగాణ రాష్ట్రంలో మంత్రి పదవిలో లేకపోవడం బాధ అనిపిస్తున్నది. మహిళా సదస్సులో ఇవాంక పక్కన కూర్చున్న మంత్రి కేటీఆర్ ఆడవా..మాడవా చెప్పాలి. తెలంగాణలో గుజరాత్ కాంగ్రెస్ కార్యకర్తలను ఆదర్శంగా తీసుకుందాం. కేసిఆర్ ను గద్దె దింపుదాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నలుగురికి తగ్గకుండా మహిళలకు మంత్రులుగా చేసి గౌరవిద్దాం.

తండాలను గ్రామపంచాయతీ లు చేస్తా అని మాట తప్పిండు కేసిఆర్. కొత్తబిచ్చగాళ్ళలా పక్క పార్టీనేతలను టిఆర్ఎస్ కొనుగోలు చేసి రాజకీయ రాక్షస క్రీడ నడుపుతున్నది. మంత్రి లక్ష్మారెడ్డి ఒక నకిలీ డాక్టర్.. అసలు డాక్టర్ కాదు మున్నా భాయ్ ఆర్ఎంపి. లక్ష్మారెడ్డి రియలెస్టేట్ వ్యాపారిగా మారిపోయిండు. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర 350ఎకరాల భూమి కొనడానికి లక్ష్మారెడ్డికి డబ్బులు ఎలా వచ్చాయి ?

 

loader