చట్ట సవరణ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేతలు రెచ్చిపోతున్నారు. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి కేసిఆర్ ను తుగ్లక్ తో పోలుస్తూ విమర్శించారు. అయితే అంతకంటే ముందే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కొత్త వివాదాన్ని లేవనెత్తారు. అయితే రేవంత్ మాత్రం ఈరోజు ఏమాత్రం నోటి మాట జారలేదు. సిఎం చంద్రశేఖరరావు గారు అంటూ సంబోధించడం గమనార్హం. అయితే రేవంత్ ఇకపై తిట్లు పక్కన పెట్టి కేవలం సబ్జెక్ట్ వారీగా విమర్శలు చేసేందుకు ప్రయత్నించారు. నిజామాబాద్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి మరో సంచలన ప్రకటన చేశారు.

కేసిఆర్ బంధువైన శేషగిరి రావు గతంలో నిమ్స్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ సమయంలో ఆయన అవినీతికి పాల్పడి ఎసిబి కి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని రేవంత్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు కేసిఆర్ బంధువు కావడంతో శేషగిరిరావు పై ఎసిబిలో నమోదైన కేసులను విత్ డ్రా చేసిందని సంచలన ఆరోపన గుప్పించారు రేవంత్. బంధువైనందుకే ఎసిబి కేసులను ఉపసంహరించారా అని ప్రశ్నించారు.

మరోవైపు నల్లగొండ మున్సిపల్ ఛైర్ పర్సన్ భర్త శ్రీనివాస్ బొడ్డుపల్లి హత్య కేసులో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాత్ర ఉందని రేవంత్ ఆరోపించారు. పార్టీ మారనందుకే హత్య చేశారన్నారు. గజ్వెల్ టిడిపి నేత ఒంటేరు ప్రతాస్ రెడ్డి పార్టీ మారకపోవడంతో అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారని ఆరోపించారు. రేవంత్ ఇంకేమన్నారో కింది వీడియోలో చూడండి.