టిఆర్ఎస్ మంత్రులను ఇంకో వివాదంలోకి గుంజిన రేవంత్

First Published 5, Dec 2017, 5:36 PM IST
Revanth drags TRS ministers into another controversy
Highlights
  • డిసెంబరు 9 వరకు సైలెంట్ అంటూనే రేవంత్ వ్యూహం
  • సర్కారును ఇరుకునపెట్టేందుకు స్కెచ్

టిఆర్ఎస్ సర్కారును వదల బొమ్మాలీ అంటున్నారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. ఆయన డిసెంబరు 9వ తేదీనుంచి కాంగ్రెస్ యాక్టీవ్ పాలిటిక్స్ లో పాల్గొంటానని అంటూనే లోపాయికారిగా టిఆర్ఎస్ సర్కారుకు గట్టిగానే పొగ పెడుతున్నారు. నిన్నటికి నిన్న అచ్చంపేటలో భారీ ర్యాలీ నిర్వహించి టిఆర్ఎస్ పై  విమర్శల వర్షం కురిపించారు.

తాజాగా గతంలో మంత్రులు టీఆర్ఎస్ ప్లీనరీ ఖర్చుల కోసం గులాబీ కూలీ చేసిన విషయాన్ని వివాదం చేస్తున్నారు. మంత్రుల గులాబీ కూలీ పనిదినాలపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి. కూలీ పేరుతో మంత్రులు విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేశారని రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా ఆరోపిస్తున్నారరు. దీనిపై కోర్టులో కేసు వేస్తానని కూడా పలు సందర్భాల్లో రేవంత్ కామెంట్ చేశారు. ఇప్పుడు ఆచరణలో పెట్టారు. మంత్రులు చేసిన పని ముమ్మాటికీ బహిరంగ లంచం తీసుకోవడమేనని పిటీషన్ లో రేవంత్ రెడ్డి వివరించారు.

ఇదే విషయమై గతంలోనే రేవంత్ రెడ్డి  తన ప్రయత్నాలు చేశారు. తెలంగాణ మంత్రుల కూలి సంపాదనపై అవినీతి నిరోదక చట్టం కింద విచారణ జరపాలని ఏసీబీకి ఫిర్యాదు చేశారు. కానీ ఏసీబీ స్పందించలేదని అందుకే ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించినట్లు చెబుతున్నారు రేవంత్ రెడ్డి. ఈ విషయమై విచారణకు ఆదేశించాలని పిటీషన్ లో న్యాయస్థానాన్ని కోరారు రేవంత్.

రేవంత్ హైకోర్టులో వేసిన పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశాలున్నట్లు న్యాయవాదులు చెబుతున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటినుంచి యాక్టీవ్ గా లేను అంటూనే సరికొత్త వివాదాన్ని రేవంత్ లేవనెత్తడంతో రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.

loader