పాలకుర్తిలో ఎర్రబెల్లిని రేవంత్ ఏమన్నాడో తెలుసా ?

revanth comments on errabelli dayakar rao at palakurthi constituency
Highlights

గరం గరం విమర్శలు గుప్పించిన రేవంత్

తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్ర జనగామ జిల్లాలో బుధవారం కొనసాగింది. జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన సభలో కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావుపై నిప్పులు చెరిగారు.

గతంలో ఇద్దరూ టిడిపిలో ఉన్నవారే. తర్వాత కాలంలో ఇద్దరూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి చెరో పార్టీలో చేరిపోయారు.

పాలకుర్తిలో రేవంత్ మాటలు....

పాలకుర్తి ప్రాంతం పోరాటాల పురటిగడ్డ. గడీలకు వ్యతిరేకంగా, తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికింది పాలకుర్తి గడ్డ. ఇలాంటి పోరాటల గడ్డ మీద టిడిపి పార్టీని మట్టిలో కలిపేసిండ్రు ఎర్రబెల్లి. కేసీఆర్ కాళ్ళ వద్ద టిడిపి పార్టీని పెట్టేసి టిడిపి నాయకుల్ని మోసం చేసిండు ఎర్రబెల్లి. ఇన్ని నిర్బంధాలు చేసినా.. మీటింగ్ కు రాకుండా ట్రాక్టర్లు, ఆటోలు ఆపినా కాంగ్రెస్ సభకు ఇంత మంది రావడం విశేషం.

అనుచరుల ప్రాణాలు పోయినా సరే కాంట్రాక్టులు, అధికారం కోసం కర్కోటక మనిషిగా మారిపోయిండు ఎర్రబెల్లి. 16 మంది ముఖ్యమంత్రులు 69 వేల కోట్లు అప్పు జేస్తే కేసీఆర్ మాత్రం కుర్చీ ఎక్కిన నాలుగేళ్లలో లక్షా 52 వేల కోట్లు అప్పు జేసిండు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ చేసిన అవినీతిని బయటపెడుతుందనే కాంగ్రెస్ శాసనసభ్యులను  సస్పెండ్, సభనుండి బయటకి పంపిండ్రు.

 పేదలకు డబుల్ బెడ్ రూమ్, దళితులకు మూడెకరాల భూమి, ఫీజ్ రియంబర్స్ మెంట్ ఇచ్చితివా, మైనార్టీ లకు, గిరిజనులకు రిజర్వేషన్ పెంచితివా. ఎన్నికల హామీలన్నీ నీటి మూటలు చేసావు.

loader