కాంగ్రెస్ పై అసంతృప్తి : భగ్గుమన్న రేవంత్

First Published 8, May 2018, 8:02 PM IST
revanth chit chat with media
Highlights

గరం గరం..

తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అసంతృప్తి బాంబు పేల్చారు. సొంత పార్టీపై సంచలన ఆరోపణలు గుప్పించారు. పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో పలు అంశాలపై చిట్ చాట్ చేశారు. రేవంత్ ఏమన్నారో కింద చదవండి.

నాకు కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రసిడెంట్ పదవి వద్దు. ఈ విషయంపై రాహుల్ గాంధీకి లేఖ రాస్తా. నన్ను పార్టీలోకి ఆహ్వానించినప్పుడు రాహుల్ దూతలు చాలా హామీలిచ్చారు.

రాష్ట్ర కాంగ్రెస్ టీం లీడర్ కు సలహాలిచ్చేవారు సరిగాలేరు. నా పనితీరు తెలిసి కూడా టీం లీడర్ నన్ను సరిగా వాడుకోవడంలేదు (ఉత్తమ్ ను ఉద్దేశించి).

నా హోదాకు తగిన పదవి ఇస్తేనే తీసుకుంటా. లేదంటే తీసుకోను. అవసరమైతే సామాన్య కార్యకర్తగానైనా పనిచేస్తాను. నాకు వయసు, ఓపిక ఉన్నాయి. నా లక్ష్యం సిఎం పదవే.

ఇవాళ కాకపోయినా కొంతకాలం తర్వాతైనా సిఎం అవుతాను. నా హోదాకు తగ్గ పదవి ఇస్తేనే తీసుకుంటాను. నా పనితనాన్ని వాడుకుంటే కాంగ్రెస్ కు సొమ్మవుతుంది.

నన్ను సరిగా వాడుకోకపోతే కాంగ్రెస్ పార్టీకే నష్టం. నేను సలహా ఇచ్చిన తర్వాతే కోమటిరెడ్డి, సంపత్ కుమార్ దీక్షలు చేశారు.

loader