ఈ మధ్య కేసిఆర్ పరువు పోయింది అందుకే కొత్త డ్రామా టిఆర్ఎస్ లఫంగలకు భూముల వివరాలు ఇవ్వాలా? సమగ్ర కుటుంబ సర్వే ఏమైంది? మన ఊరు మన ప్రణాళిక ఎక్కడ పోయింది? గ్రామ జ్యోతి ఎక్కడ ఆరిపోయింది?
తెలంగాణ సిఎం కేసిఆర్ పై విరుచుకుపడ్డారు టిడిపి నేత రేవంత్ రెడ్డి. సర్కారు కొత్తగా తీసుకొచ్చిన రైతు సమితి తీరును ఖండించారు రేవంత్. నిజాం పాలనా కాలంలో ఉన్నట్లు కేసిఆర్ కూడా రజాకార్ల సైన్యాన్ని రైతు సమితి పేరిట తయారు చేస్తున్నారని మండిపడ్డారు. టిడిపి ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో రైతు సమితిల ఏర్పాటుపై రేవంత్ సవివరంగా మాట్లాడారు. ఆయన మాటల్లోనే...
సమస్యలనుంచి ప్రజల దృష్టి మరల్చడానికి సీఎం కొత్త నాటకానికి తెర లేపారు. ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల వల్ల ప్రజల్లో సీఎం పరువు పోయింది. దీన్ని కప్పిపుచ్చడానికి రైతు సమన్వయ సమితీలను ఏర్పాటు చేస్తున్నట్టు చెపుతున్నారు. రాష్ట్ర మంత్రి వర్గం నిచేతనా స్థితిలోకి వెళ్లింది. రాష్ట్ర మంత్రులు సీఎం ఇంట్లో పనిచేసే పని మనుషులుగా మారిపోయారు. సీఎం కు సంఖ్యా శాస్త్రం పిచ్చి ముదిరింది. సీఎం కొందరు ఉన్మాదులను తయారు చేశాడు. సీఎం ఏం చేసినా వాళ్లు ఆహా ఓహో అంటూ భజన చేస్తున్నారు.
మన ఊరు మన ప్రణాళిక అంటూ హడావిడి చేశారు. 3 సంవత్సరాలు గడుస్తున్నా దిక్కు మొక్కు లేదు. మన ఊరెటు పోయిందో, మన ప్రణాళిక ఎటు పోయిందో తెల్వదు కానీ. ఆ ప్రణాళిక పెట్టిన మంత్రి మాత్రం పక్క శాఖకు వెళ్లిపోయిండు. జనాలకు దీంతోటి ఒరిగిందేమీలేదు. ఇది సిఎం వైఫల్యమా? లేక ఆయన కొడుకు అప్పట్లో దీన్ని తీసుకొచ్చిన మంత్రి కేటిఆర్ వైఫల్యమా ఇంకా తేలలేదు.
సమగ్ర కుటుంబ సర్వే అంటూ ప్రజలను భయపెట్టాడు, బాధ పెట్టాడు. ఇతర దేశాలలో ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళు కూడా వేలు ఖర్చు పెట్టుకుని వచ్చి పేర్లు నమోదు చేసుకున్నారు. ఆ రోజు సమగ్ర కుటుంబ సర్వే లో భూముల వివరాలు తీసుకున్నారు. పక్కాగా ఊర్లో ఉన్న భూముల వివరాలు తీసుకున్నారు. సమగ్ర కుటుంబ సర్వే చేసి 3 సంవత్సరాలు పూర్తి అయింది. అదెటు పోయిందో ఏమైందో ఎవరికి ఎర్కలేదు. అది బుట్ట దాఖలు చేశారు.
గ్రామ జ్యోతి పథకంతో గ్రామాలను అభివృద్ధి చేస్తాం అని గొప్పలు చెప్పారు. కానీ పంచాయతీలకు కనీస నిధులు కూడా ఇవ్వడం లేదు. ప్రభుత్వం చాలా ధీనావస్థలో ఉండిపోయింది. పోయిన దసరాకు ప్రకటించిన కొత్త జిల్లాల విస్తీర్ణం, జనాభా పై ఇప్పటివరకు స్పష్టత లేదు. కొత్త జిల్లాల వల్ల 20లక్షల జనాభా ఎక్కడికి పోయిందో తెలియడం లేదు. గ్రామాల జనాభాకు రాష్ట్ర జనాభాకు పొంతన లేదు. 31 జిల్లా ల వివరాలు ఇప్పటివరకు లేవు. ఇలాంటి దిక్కు మాలిన నిర్ణయాల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సీఎం చేతిలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది.
తెరాస లో తిరిగే పనిలేని లఫంగి గాళ్లను రైతు కమిటీలలో వేస్తారట. ఆ పనికిమాలిన లఫంగల చుట్టూ రైతులు తిరగలా? వివాదాస్పద భూములన్నింటినీ వాళ్లు రైతులను బెదిరించి వసూళ్లు చేయడానికి ఈ కమిటీలు పనికొస్తయి తప్ప ఇంకోదానికి కాదు. ఇక మండల కమిటీ లో తెరాస గజ దొంగలు ఉంటారు. వాడికి కూడా రైతులు చెల్లించుకోవాల్సిందే. ఇక గ్రామాలు మండలం దాటితే జిల్లాలో తెరాస బకాసురులు ఉంటారు. ఇలాంటి చెత్త నిర్ణయాలు తీసుకుంటున్న కేసీఆర్ ను ఏం చేయాలో రైతులే నిర్ణయిస్తారు. రెవెన్యూశాఖ ను నిర్వీర్యం చేసి టిఆర్ఎస్ లఫంగి గాళ్లను తెరమిదికి తెస్తున్నారు. ప్రజల ఆస్తులను టిఆర్ఎస్ లంగల చేతిలో పెట్టాలట? ప్రజలను పీడించుకుని తినడానికి రైతు సమాఖ్య సమితిలు తెస్తున్నారు.
దేవుని భూములను దోచుకున్న జూపల్లి చేతిలో 4 జిల్లాల రైతుల భవిష్యత్తు పెడుతున్నారు. జూపల్లి తప్పుడు కాగితాలతో బ్యాంక్ లను నిండా ముంచాడు. హైద్రాబాద్, రంగారెడ్డి జిల్లాలోని కబ్జా భూములను లీగల్ గా చేసుకోవడానికి ప్రత్నిస్తున్నారు. అధికారులు భయపడి సంతాకలు చేయడం లేదని రైతు సమన్వయ సమితి ని తీసుకొచ్చారు. వేల ఎకరాల భూములను అన్యాక్రాంతం చేయడానికి కేసీఆర్ ఎత్తులు వేస్తున్నారు. దీని వల్ల రాష్ట్ర ఖజానాకు లక్షల కోట్ల నష్టం జరుగుతుంది.
వెంటనే go 39 ను రద్దు చేయాలి. నిజంగా భూముల వివరాలు కావాలంటే సమగ్ర కుటుంబ సర్వే లో తీసుకున్నారు కదా? ఎన్టీఆర్ పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేస్తే, అదే నయా పటేల్ పట్వారీ వ్యవస్థను నియమిస్తుండు కేసిఆర్. ఆస్తి వివరాలు ప్రభుత్వ అధికారులకు ఇస్తాం కానీ టిఆర్ఎస్ లఫంగి గాళ్లకు ఎందుకు ఇస్తారు? రైతులారా... ఎవరూ తెరాస దొంగలకు మీ భూముల వివరాలు ఇవ్వకండి. ఈ లఫంగి గాళ్లకు అధ్యక్షుడు గజ దొంగ అయిన జూపల్లి. వీళ్లు ఇలాగే ఉంటే రైతులంతా కలిసి భరతం పట్టుడు ఖాయం అని రేవంత్ విమర్శల వర్షం కురిపించారు.
ఇక తను మాట్లాడిన మాటల్లో ఏమైనా తప్పులున్నా, తప్పుడు సమాచారం చెప్పినా కోర్టులో కేసులు వేసుకోవచ్చని ప్రభుత్వానికి రేవంత్ సవాల్ విసిరారు. మరి రేవంత్ సవాల్ పై సర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
