హైద్రాబాద్  నార్సింగి పోలీస్ స్టేషన్  పరిధిలో  గల పీరం చెరువులో  రేవన్ సిద్దప్ప అనే వ్యక్తి  ఇవాళ  ఆత్మహత్య  చేసుకున్నాడు. భార్యతో  గొడవపడి  రేవన్ సిద్దప్ప  సూసైడ్  చేసుకున్నాడు.  

హైదరాబాద్: నగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీరం చెరువులో మంగళవారం నాడు భార్యతో గొడవపడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పీరం చెరువుకు చెందిన రేవన్ సిద్దప్ప అనే వ్యక్తి భార్యతో గొడవపడ్డాడు. దీంతో మనస్థాపానికి గురైన రేవన్ సిద్దప్ప భార్యచూస్తుండగానే భవనంపై నుండి దూకాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి సిద్దప్ప మృతి చెందినట్టుగా ప్రకటించారు.