హైదరాబాద్ :గాజుల రామారం డివిజన్  కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కూన శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ కు రిటర్నింగ్ అధికారి ఆదివారం నాడు ఆమోదించారు.కొన్ని కారణాలతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కూన శ్రీనివాస్ గౌడ్ అభ్యర్ధిత్వాన్ని తిరస్కరించాడు రిటర్నింగ్ అధికారి.

also read:గాజులరామారం కాంగ్రెస్ అభ్యర్ధికి ఊరట: కూన శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ తిరస్కరణపై హైకోర్టు స్టే

ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో సవాల్ చేసింది. నామినేషన్ తిరస్కరణపై హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రేవంత్ రెడ్డి ఎన్నికల అధికారికి ఆదివారం నాడు అందించారు.ఈ ఉత్తర్వులను  పరిశీలించిన రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ ను ఆమోదించారు.

శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ తిరస్కరణను సీరియస్ గా తీసుకొన్న కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ లో కాంగ్రకెస్ పార్టీకి అనుకూలంగా స్టే ఇచ్చింది. శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ తిరస్కరణపై హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందిే.