హైదరాబాద్:  గాజుల రామారం కాంగ్రెస్ అభ్యర్ధికి హైకోర్టులో ఊరట లభించింది.  కూన శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ తిరస్కరణపై ఆదివారం నాడు హైకోర్టు స్టే ఇచ్చింది.

గాజుల రామారం కాంగ్రెస్ అభ్యర్ధి నామినేషన్ ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్ధి హైకోర్టును ఆశ్రయించాడు. శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ తిరస్కరణపై హైకోర్టు స్టే ఇచ్చింది.

ఈ తీర్పును కాపీని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులకు అందించనున్నారు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి. హైకోర్టు తీర్పు కాపీని అధికారులకు అందించి కూన శ్రీనివాస్ గౌడ్ ను అభ్యర్ధిత్వాన్ని కొనసాగించాలని కోరనున్నారు.

కూన శ్రీనివాస్ గౌడ్ సంతానం విషయంలో ఎన్నికల అధికారులు ఆయన నామినేషన్ ను తిరస్కరించారు. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ సోదరుడే శ్రీనివాస్ గౌడ్రాజకీయ దురుద్దేశంతోనే ఈ నామినేషన్ ను తిరస్కరించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.ఈ విషయమై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేసింది  కాంగ్రెస్ పార్టీ.