హైదరాబాద్: భరోసా( ఛైల్డ్ లైన్) సెంటర్ వద్ద హైడ్రామా చోటు చేసుకొంది. రిటైర్డ్ జడ్జి నూతి రామ్మోహన్ రావు కోడలు సింధు శర్మ తన పెద్ద కూతురు రిషితను అప్పగించాలని డిమాండ్ చేసింది.

ఆదివారం నాడు రామ్మోహన్ రావు ఇంటి ఎదుట  సింధు శర్మ, మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో  భరోసా సెంటర్‌లో పెద్ద కూతురు రిషితకు అప్పగిస్తామని  రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులు ఒప్పుకొన్నారని సింధు శర్మ చెప్పారు.

ఈ ఒప్పందం మేరకు భరోసా సెంటర్ వద్ద సింధు శర్మ, నూతి రామ్మోహన్ రావు కొడుకు వశిష్టలు భరోసా సెంటర్‌ వద్దకు సోమవారం నాడు చేరుకొన్నారు.అయితే పాపను తనకు ఇవ్వాలని సింధు శర్మ కోరారు. తండ్రి వద్దకు వెళ్లనని రిషిత చెబుతున్నా కూడ తన కూతురును తన భర్త తీసుకొన్నాడని సింధు శర్మ ఆరోపించారు.

అయితే ఈ విషయమై కోర్టులో కేసు వేస్తామని  చెప్పినందున కోర్టులోనే అప్పగిస్తామని వశిష్ట చెప్పాడని సింధు శర్మ చెబుతున్నారు. అయితే తన కూతురును అప్పగించే వరకు తాను  ఇక్కడి నుండి వెళ్లనని సింధు శర్మ చెప్పారు.

అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సింధు శర్మ ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయమై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకొంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.