Asianet News TeluguAsianet News Telugu

యాదాద్రి గర్భాలయ విమాన గోపురానికి రెండు గ్రాముల బంగారం.. విశ్రాంత ఉద్యోగి ఔదార్యం

యాదాద్రి లక్ష్మి నరసింహా స్వామి గర్భాలయా విమాన గోపురానికి విశ్రాంత ఉద్యోగి తిరునగరు యాదగిరి తన వంతుగా రెండు గ్రాముల బంగారాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు.ఈ మేరకు శనివారం ఉదయం సూర్యపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీష్ రెడ్డి ని కలసి రెండు గ్రాముల బంగారానికి అయ్యే మొత్తం పదివేల రూపాయలను ఆయన చెక్ రూపంలో అందజేశారు.

retired employee donates two grams of gold for Yadadri Garbhalaya vimana gopuram
Author
Hyderabad, First Published Dec 4, 2021, 1:53 PM IST

సూర్యాపేట : Yadadri గర్భాలయా విమాన గోపురానికి రెండు గ్రాముల బంగారాన్ని విరాళంగా సమర్పించి తన ఔదార్యం చాటుకున్నాడు ఓ retired employee.  ఈ మేరకు మంత్రి Jagdish Reddyకి పదివేల రూపాయల చెక్ అందజేశాడు. 

retired employee donates two grams of gold for Yadadri Garbhalaya vimana gopuram

గతంలోనూ సదరు విశ్రాంత ఉద్యోగి హరిత నిధికి ఆర్థిక సహాయం అందించారు. విశ్రాంత ఉద్యోగి తిరునగరు యదగిరి ఔదర్యానికి మంత్రి జగదీష్ రెడ్డి అభినందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోనీ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి లక్ష్మి నరసింహా స్వామి గర్భాలయా విమాన గోపురానికి కావాల్సిన బంగారాన్ని విరాళం రూపంలో అందించేందుకు భక్తులు విశేష సంఖ్యలో ముందుకు వస్తున్న విషయం విదితమే. 

ఈ క్రమంలో నే Suryapeta కు చెందిన విశ్రాంత ఉద్యోగి తిరునగరు యాదగిరి తన వంతుగా రెండు గ్రాముల బంగారాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు.ఈ మేరకు శనివారం ఉదయం సూర్యపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీష్ రెడ్డి ని కలసి రెండు గ్రాముల బంగారానికి అయ్యే మొత్తం పదివేల రూపాయలను ఆయన చెక్ రూపంలో అందజేశారు.

అంతకు ముందు సదరు విశ్రాంత ఉద్యోగి తిరునగరు యాదగిరి ముఖ్యమంత్రి KCR ప్రకటించిన హరిత నిధికి నిధులు ఇచ్చి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.ముందుకు వచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్న విశ్రాంత ఉద్యోగి తిరునగరు యాదగిరి ని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభినందించారు.

యాదాద్రి ఆలయానికి ఏడుకిలోల బంగారం విరాళం... ఈవోకు అందజేసిన మంత్రి మల్లారెడ్డి

ఇదిలా ఉండగా, తెలంగాణలోకి ప్రముఖ దేవాలయమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్మిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్న విషయం తెలిసిందే. వందల కోట్లు ఖర్చుచేసి ఈ ఆలయాన్ని సర్వాంగసుందరంగా నిర్మించిన ప్రభుత్వం ఈ పవిత్ర కార్యంలో భక్తులను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. తిరుమల తిరుపతి దేవాలయం తరహాలో ప్రధాన ఆలయ విమాన గోపురానికి స్వర్ణతాపడం  చేయించాలని నిర్ణయించిన కేసీఆర్ సర్కార్ అందుకోసం భక్తులనుండే బంగారాన్ని సేకరించనున్నట్లు ప్రకటించారు. 

CM KCR పిలుపుమేరకు Yadadri temple యాదాద్రి ఆలయానికి భారీగా బంగారాన్ని అందించాలని మంత్రి చామకూర మల్లారెడ్డి నిర్ణయించారు. ఇందులోభాగంగా మల్లారెడ్డి కుటుంబం తరపునే కాదు వ్యాపారసంస్థల తరపున బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు స్వయంగా సీఎం కేసీఆరే ప్రకటించారు. అయితే తాను ప్రాతినిధ్యంవహిస్తున్న మేడ్చల్ జిల్లా తరపున కూడా యాదాద్రి ఆలయానికి 11కిలోల బంగారాన్ని విరాళంగా అందివ్వనున్నట్లు minister mallareddy ప్రకటించారు. 

ఇందులో భాగంగానే నవంబర్ 8న కుటుంబసమేతంగా యాదాద్రి ఆలయానికి చేరుకున్న మల్లారెడ్డి.. నరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఏడు కిలోల బంగారానికి సంబంధించి రూ.3.10 కోట్లను స్వామివారి సన్నిధిలోనే ఈవో గీతకు అందజేసారు.  తొలి విడతలో అక్టోబర్ 28నే మంత్రి మల్లారెడ్డి మూడు కిలోల బంగారానికి సంబంధించి రూ.1.83 కోట్లను విరాళం అందజేశారు. తాజాగా మరో ఏడున్నర కిలోలతో కలిసి మొత్తం 10 కిలోలకు గాను మొత్తం రూ.4.93 కోట్లు ఈవో గీతారెడ్డికి  మంత్రి అప్పగించారు. త్వరలోనే మరో కేజీకి సంబంధించిన విరాళాలు ఆలయ అధికారులకు అందజేయనున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios