Asianet News TeluguAsianet News Telugu

యాదాద్రి ఆలయానికి ఏడుకిలోల బంగారం విరాళం... ఈవోకు అందజేసిన మంత్రి మల్లారెడ్డి

యాదాద్రి ఆలయానికి స్వర్ణతాపడం కోసం భారీగా విరాళాలు అందుతున్నాయి. తాజాగా మంత్రి మల్లారెడ్డి కుటుంబసమేతంగా స్వామివారిని దర్శించుకుని ఆ సన్నిధిలోనే మరో ఏడు కిలోల బంగారాన్ని ఈవోకు అందించారు. 

minister malla reddy donates seven kg gold to yadadri temple
Author
Yadadri temple city, First Published Nov 8, 2021, 2:33 PM IST

భువనగిరి: తెలంగాణలోకి ప్రముఖ దేవాలయమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్మిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్న విషయం తెలిసిందే. వందల కోట్లు ఖర్చుచేసి ఈ ఆలయాన్ని సర్వాంగసుందరంగా నిర్మించిన ప్రభుత్వం ఈ పవిత్ర కార్యంలో భక్తులను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. తిరుమల తిరుపతి దేవాలయం తరహాలో ప్రధాన ఆలయ విమాన గోపురానికి స్వర్ణతాపడం  చేయించాలని నిర్ణయించిన కేసీఆర్ సర్కార్ అందుకోసం భక్తులనుండే బంగారాన్ని సేకరించనున్నట్లు ప్రకటించారు. 

CM KCR పిలుపుమేరకు Yadadri temple యాదాద్రి ఆలయానికి భారీగా బంగారాన్ని అందించాలని మంత్రి చామకూర మల్లారెడ్డి నిర్ణయించారు. ఇందులోభాగంగా మల్లారెడ్డి కుటుంబం తరపునే కాదు వ్యాపారసంస్థల తరపున బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు స్వయంగా సీఎం కేసీఆరే ప్రకటించారు. అయితే తాను ప్రాతినిధ్యంవహిస్తున్న మేడ్చల్ జిల్లా తరపున కూడా యాదాద్రి ఆలయానికి 11కిలోల బంగారాన్ని విరాళంగా అందివ్వనున్నట్లు minister mallareddy ప్రకటించారు. 

minister malla reddy donates seven kg gold to yadadri temple

ఇందులోభాగంగానే ఇవాళ కుటుంబసమేతంగా యాదాద్రి ఆలయానికి చేరుకున్న మల్లారెడ్డి నరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఏడు కిలోల బంగారానికి సంబంధించి రూ.3.10 కోట్లను స్వామివారి సన్నిధిలోనే ఈవో గీతకు అందజేసారు.  

read more   చిన్నారి బాలుడి పెద్దమనసు... యాదాద్రి ఆలయానికి బంగారు ఉంగరం విరాళం

తొలి విడతలో అక్టోబర్ 28నే మంత్రి మల్లారెడ్డి మూడు కిలోల బంగారానికి సంబంధించి రూ.1.83 కోట్లను విరాళం అందజేశారు. తాజాగా మరో ఏడున్నర కిలోలతో కలిసి మొత్తం 10 కిలోలకు గాను మొత్తం రూ.4.93 కోట్లు ఈవో గీతారెడ్డికి  మంత్రి అప్పగించారు. త్వరలోనే మరో కేజీకి సంబంధించిన విరాళాలు ఆలయ అధికారులకు అందజేయనున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు.

యదాద్రి ఆలయ విమాన గోపురానికి తిరుమల తరహాలో స్వర్ణ తాపడం చేయించాలని నిర్ణయించినట్టు... ఇందుకోసం  125 కిలోల బంగారం అవసరం అని తెలిపారు. ఈ బంగారాన్ని భక్తుల నుండే సేకరించనున్నట్లు... ఎవరికి తోచినంత వారు విరాళం ఇవ్వవచ్చని తెలిపారు. ఇందులో భాగంగానే తొలి విరాళం తన కుటుంబమే అందిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. తమ కుటుంబం తరఫున ఒక కిలో 16 తులాల బంగారం ఇస్తామని ప్రకటించారు.

minister malla reddy donates seven kg gold to yadadri temple

ఇక, యాదాద్రి  ఆల‌య విమాన గోపురానికి స్వ‌ర్ణ తాప‌డం కోసం విరాళాలు ఇవ్వాల‌ని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపున‌కు చాలా మంది స్పందిస్తున్నారు. చినజీయర్  స్వామి పీఠంతో సహా పలువురు  వ్యాపారవేత్తలు కూడా విరాళాలు అందజేస్తున్నారు.  

read more  Yadadri Temple : కేసిఆర్ చరిత్రలో నిలిచిపోతారు.. స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి కితాబు.. (వీడియో)

అయితే కేవలం తెలంగాణ నుంచే  కాకుండా ఏపీ  నుంచి కూడా యాదాద్రి  ఆల‌య విమాన గోపురానికి స్వ‌ర్ణ తాప‌డం కోసం విరాళాలు ఇచ్చేందకు ముందుకు  వస్తున్నారు. కడప జిల్లాకు చెందిన వైసీపీ  నాయకురాలు, చిన్న మండెం జడ్పీటీసీ మోడం జయమ్మ కిలో బంగారం విరాళంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును యాదాద్రి ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి స‌న్నిదిలో అంద‌జేస్తాన‌ని ఆమె తెలిపారు.  

minister malla reddy donates seven kg gold to yadadri temple

అలాగే జిల్లాలవారిగా కూడా టీఆర్ఎస్ శ్రేణులు విరాళాలు అందిస్తున్నారు. సిద్దిపేట జిల్లా తరపున కిలో బంగారాన్ని అందించనున్నట్లు మంత్రి హరీష్ రావు ప్రకటించారు. అలాగే వివిధ జిల్లాలకు చెందిన నాయకులు,ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బంగారాన్ని అందివ్వడానికి సిద్దమయ్యారు. బంగారాన్ని విరాళంగా ఇచ్చే విషయంలో మేడ్చల్ జిల్లా తరపున మంత్రి మల్లారెడ్డి ముందున్నారు.  
 
 

Follow Us:
Download App:
  • android
  • ios