Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో "నారింజ" ఫేక్ న్యూస్: రిటైర్డ్ ఆర్మీ మేజర్ అరెస్ట్, కారణమేంటంటే...

పోలీసులు హైదరాబాద్ లో సంత్రాల అమ్మకం నిషేధించారని డక్కన్ క్రానికల్ పేపర్ టైటిల్ పెట్టి ఫేక్ న్యూస్ ని వ్యాప్తి చేసాడు. సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ ప్రెస్ తో మాట్లాడుతున్న ఒక ఫోటో పెట్టి హైదరాబాద్ లో నారింజల అమ్మకాలను నిషేధించిన సైబరాబాద్ పోలీసులు అని ప్రచారం చేసాడు. 

Retired army major arrested in hyderabad for spreading fake news over oranges ban
Author
Hyderabad, First Published Apr 28, 2020, 5:21 PM IST

ఈ కరోనా వైరస్ కష్టకాలంలో ప్రజలు ఈ వైరస్ తో పాటుగా ఫేక్ న్యూస్ తో కూడా పోరాటం చేయాల్సి వస్తోంది. ఈ ఫేక్ న్యూస్ ని ఎవరు ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో కూడా అర్థమవడం లేదు. తాజాగా ఇలాంటిదే ఒక ఫేక్ న్యూస్ హైదరాబాద్ లో కూడా బాగా వైరల్ అయింది. 

పోలీసులు హైదరాబాద్ లో సంత్రాల అమ్మకం నిషేధించారని డక్కన్ క్రానికల్ పేపర్ టైటిల్ పెట్టి ఫేక్ న్యూస్ ని వ్యాప్తి చేసాడు. సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ ప్రెస్ తో మాట్లాడుతున్న ఒక ఫోటో పెట్టి హైదరాబాద్ లో నారింజల అమ్మకాలను నిషేధించిన సైబరాబాద్ పోలీసులు అని ప్రచారం చేసాడు. 

ఇంతకు కారణం చెప్పలేదు కదూ.... హైదరాబాద్ లో లౌకికత్వానికి చిహ్నంగా ఈ కాషాయ రంగులో ఉండే సంత్రాలను బాన్ చేసినట్టు ఆ ఫేక్ న్యూస్ లో రాసుకొచ్చాడు ఈ రిటైర్డ్ మేజర్. 

అవును నిజమే ఈ ఫేక్ న్యూస్ ని వ్యాప్తి చేసింది ఒక రిటైర్డ్ ఆర్మీ మేజర్. ఆర్మీ మేజర్ ఇలా మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ఫేక్ న్యూస్ ని ప్రచారం చేయడంపై పోలీసులు సైతం నివ్వెరపోయారు. ఆయనను నేడు పోలీసులు అరెస్ట్ చేసారు. 

ఇకపోతే, తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. సోమవారం కొత్తగా కేవలం 2 కేసులు మాత్రమే నమోదుకావడంతో ప్రభుత్వ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఇవాళ నమోదైన రెండు కేసులు కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే కావడం గమనార్హం. ఈ రోజు నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1003కు చేరుకుంది.

ఇప్పటి వరకు 25 మంది మరణించగా, 332 మంది కోలుకోవడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 646కు చేరుకుంది. సోమవారం 16 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

మరోవైపు రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పట్టడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతుండడం శుభసూచకమని, రాబోయే కొద్ది రోజుల్లోనే కరోనా పాజిటివ్ కేసులు లేని రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు.

ఏప్రిల్ 28 నాటికి రాష్ట్రంలోని 21 జిల్లాలు ఒక్క కరోనా ఆక్టివ్ కేసు కూడా లేని జిల్లాలుగా మారుతున్నాయని సిఎం ప్రకటించారు. కరోనా వైరస్ సోకిన వారిలో కూడా  97 శాతానికి పైగా పేషంట్లు కోలుకుని, డిశ్చార్జి అవుతుండడం మంచి పరిణామమన్నారు.

వైరస్ వ్యాప్తి, ప్రభావం బాగా తగ్గుతున్నందున రాష్ట్రంలో కంటైన్మెంట్ల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతున్నట్లు ప్రకటించారు. మర్కజ్ వెళ్లి వచ్చిన వారి ద్వారా వైరస్ సోకుతున్న వారి లింక్ మొత్తం గుర్తించి, అందరికీ పరీక్షలు నిర్వహించే ప్రక్రియ కొనసాగుతున్నదని వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios