పీఓపీ గ‌ణేష్ విగ్రహాల నిమజ్జనంపై ఆంక్షలు.. హైద‌రాబాద్ లో భ‌క్తుల ఆందోళ‌న‌లు

Ganesh Immersion: ఈ నెల 28న గణేష్ నిమజ్జనం రోజున ఊరేగింపు సజావుగా సాగేందుకు హైదరాబాద్ పోలీసు ట్రై కమిషనరేట్ అధికారులు కట్టుదిట్టమైన మార్గదర్శకాలు, భద్రతా ఏర్పాట్లను రూపొందించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ ఎంసీ)లో 74 నిమజ్జన కేంద్రాలు, 24 పోర్టబుల్ ఇమ్మర్షన్ బేబీ చెరువులు, 27 బేబీ చెరువులు ఉన్నాయి. ట్యాంక్ బండ్ చుట్టుపక్కల 36 నిమజ్జన వేదికల నిర్మాణాలను పలు శాఖలు చేపట్టనున్నాయి.
 

Restrictions on immersion of POP Ganesh idols, protests by Hyderabad devotees RMA

Ganesh Immersion-PoP idols: గతంలో విధించిన నిషేధం ఇప్పటికీ అమలులో ఉందని తెలంగాణ హైకోర్టు పునరుద్ఘాటించిన నేపథ్యంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేశారనే కారణంతో హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయకుండా సోమవారం అర్ధరాత్రి పలు విగ్రహాలను నిలిపివేశారు. దీంతో వందలాది మంది మండపాల నిర్వాహకులు, భక్తులు గణేష్ ఉత్సవాలతో సంబంధం ఉన్న కొన్ని సంస్థల మద్దతుతో ట్యాంక్ బండ్ పై ఆకస్మికంగా బైఠాయించి సుమారు గంటపాటు ట్రాఫిక్ ను స్తంభింపజేశారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని హైకోర్టును ఆశ్రయించి యథావిధిగా విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసేలా చూడాలని నిర్వాహకులు డిమాండ్ చేశారు.

ఆందోళనల ఫలితంగా ట్యాంక్ బండ్ కు రెండు కిలోమీటర్ల దూరంలోని రహదారుల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్యాంక్ బండ్ పై మోహరించిన పోలీసులుకు వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ''ఎన్నో ఏళ్లుగా నిమజ్జనం కోసం ఇక్కడికి వస్తున్నాం. నిమ‌జ్జ‌నం రోజు దగ్గరపడుతోంది. ఇలాంటి ఆదేశాలు లక్షలాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని'' మండపం నిర్వాహకుడు ఒకరు తెలిపారు. రోడ్డును క్లియర్ చేయాలని ఆందోళనకారులకు నచ్చజెప్పేందుకు పలుమార్లు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ కోసం రోడ్లను క్లియర్ చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు.

ఇదిలావుండ‌గా, ఈ నెల 28న గణేష్ నిమజ్జనం రోజున ఊరేగింపు సజావుగా సాగేందుకు హైదరాబాద్ పోలీసు ట్రై కమిషనరేట్ అధికారులు కట్టుదిట్టమైన మార్గదర్శకాలు, భద్రతా ఏర్పాట్లను రూపొందించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ ఎంసీ)లో 74 నిమజ్జన కేంద్రాలు, 24 పోర్టబుల్ ఇమ్మర్షన్ బేబీ చెరువులు, 27 బేబీ చెరువులు ఉన్నాయి. ట్యాంక్ బండ్ చుట్టుపక్కల 36 నిమజ్జన వేదికల నిర్మాణాలను పలు శాఖలు చేపట్టనున్నాయి. నిమజ్జనం రోజున భద్రత కోసం తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ) సహా పోలీసు శాఖలకు చెందిన 20 వేల మందికి పైగా అధికారులను మోహరించనున్నారు.

గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసే దాదాపు 33 సరస్సులలో డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ (DRF) నుండి మొత్తం 453 మంది సిబ్బంది, మరో 100 మంది ప్రొఫెషనల్ డైవర్లు/ఈతగాళ్లు అందుబాటులో ఉంటారు. ఇదిలావుండగా, రద్దీని నివారించడానికి, సకాలంలో ఊరేగింపు జరిగేలా విగ్రహాలను తీసుకువెళ్లే వాహనాలు ముందుగానే ప్రారంభించాలని నగర పోలీసులు ప్రజలకు ఒక సలహా ఇచ్చారు. నిమజ్జనం రోజున వాహనాలపై DJలతో కూడిన మ్యూజికల్ సిస్టమ్‌లను ఉపయోగించడం ఖచ్చితంగా నిషేధించబడిందనీ, వాహన కదలిక రహదారిపై ట్రాఫిక్‌ను ప్రభావితం చేయకూడదని అధికారులు స్ప‌ష్టం చేశారు. విగ్రహాలను తీసుకువెళ్లే వాహనాలను ప్రార్థనా స్థలాలు లేదా మరే ఇతర జంక్షన్‌ల దగ్గర ఆపకూడదనీ, ఊరేగింపులో పాల్గొనే వాహనాల్లో మద్యం లేదా ఇతర మత్తుపదార్థాల మత్తులో ఉన్న వ్యక్తులను అనుమతించకూడ‌ద‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios