Asianet News TeluguAsianet News Telugu

New year 2022: హైదరాబాద్‌లో మొదలైన ఆంక్షలు.. ఫ్లైఓవర్లు మూసివేత, డ్రంకెన్ డ్రైవ్‌లు

తెలుగు రాష్ట్రాల్లో న్యూఇయర్ (new year 2022) సందడి నెలకొంది. 2022కు స్వాగతం పలికేందుకు కుర్రకారు సిద్ధమయ్యారు. మరోవైపు కరోనా ఒమిక్రాన్ (omicron) వేరియంట్ భయాలు వెంటాడుతూనే వున్నాయి. ఈ పరిస్ధితుల్లో న్యూఇయర్ వేడుకలపై పలు ఆంక్షలు విధించారు అధికారులు. 

restrictions imposed in hyderabad due to new year celebrations
Author
Hyderabad, First Published Dec 31, 2021, 6:31 PM IST

తెలుగు రాష్ట్రాల్లో న్యూఇయర్ (new year 2022) సందడి నెలకొంది. 2022కు స్వాగతం పలికేందుకు కుర్రకారు సిద్ధమయ్యారు. మరోవైపు కరోనా ఒమిక్రాన్ (omicron) వేరియంట్ భయాలు వెంటాడుతూనే వున్నాయి. ఈ పరిస్ధితుల్లో న్యూఇయర్ వేడుకలపై పలు ఆంక్షలు విధించారు అధికారులు. ఇప్పటికే రెండు వేవ్స్‌గా కరోనా విజృంభించింది. ఇక ఒమిక్రాన్ వేరియంట్ వల్ల థర్డ్ వేవ్ (third wave) రావడం ఖాయమనే భయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో న్యూఇయర్ వేడుకలకు అధికారులు అనుమతించరాని భావించారు. 

అయితే సంబరాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే, షరతులు సైతం విధించారు అధికారులు. దీంతో కరోనా నిబంధనలు పాటిస్తూ న్యూఇయర్ వేడుకలకు సిద్ధమయ్యారు తెలుగు రాష్ట్రాల ప్రజలు . న్యూఇయర్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు తెరుచుకోవడానికి అనుమతించింది ప్రభుత్వం. అలాగే బార్లు, పబ్‌లలో రాత్రి ఒంటిగంట వరకు మద్యం సరఫరా చేయడానికి వీలు కల్పించారు. అయితే క్లబ్బులు, పబ్‌లు, బార్లలో న్యూఇయర్ వేడుకలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని కండీషన్ పెట్టారు పోలీసులు. 

Also Read:న‌గ‌ర‌వాసుల‌కు TSRTC గుడ్ న్యూస్.. 31న రాత్రి Special Buses

మాస్క్ ధరించని వారిని నిర్వాహకులు అనుమతించకూడదు. అలాగే మాస్క్ లేకుండా వేడుకల్లో పాల్గొనేవారికి రూ.1000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మరోవైపు హైదరాబాద్‌లో న్యూఇయర్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. తాగి వాహనాలతో రోడ్డెక్కితే తాట తీస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బేగంపేట మినహా అన్ని ఫ్లైఓవర్స్ బంద్ చేశారు. రాత్రి 10 నుంచి నగరంలోని ఫ్లైఓవర్స్ మూసివేస్తామని ప్రకటించారు. ఓఆర్ఆర్‌పై సరుకుల వాహనాలకే అనుమతించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios