తప్పిన ప్రమాదం:హైద్రాబాద్ మెహిదీపట్నంలో గ్యాస్ సిలిండర్ల పేలుడు

హైద్రాబాద్ నగరంలోని మెహిదీపట్నంలో రెస్టారెంట్ లో రెండు సిలిండర్లు పేలాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు.

Restaurant Staff Narrowly Escapes LPG Blast in  Hyderabad

హైదరాబాద్: నగరంలోని Mehdipatnam జంక్షన్ వద్ద ఉన్న కింగ్స్ Restaurant లో బుధవారం నాడు Gas సిలిండర్లు పేలాయి. రెస్టారెంట్ లోని రెండు సిలిండర్లు ఒకేసారి పేలినట్టుగా రెస్టారెంట్ సిబ్బంది చెబుతున్నారు.  ఈ విషయం వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్యాస్ సిలిండర్ల పేలుడుతో సిబ్బంది రెస్టారెంట్ నుండి భయంతో పరుగులు తీశారు. మరో వైపు ఈ రెస్టారెంట్ ఉన్న భవనం పైనే కాలేజీ ఉంది. రెస్టారెంట్ లో ఐదు గ్యాస్ సిలిండర్లున్నాయని సిబ్బంది తెలిపారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనంం ప్రసారం చేసింది.   ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

గతంలో కూడ గ్యాస్ సిలిండర్ల పేలుళ్ల ఘటనలు చోటు చేసుకొన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ లో ఈ నెల మొదటి వారంలో అమీన్ పూర్ లో గ్యాస్  పేలుడు ఘటనలో నలుగురు మరణించారు. ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదం జరిగిన ఇంట్లో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. అయితే ఈ ఐదుగురిలో నలుగురు మరణించారు.

2021 నవంబర్ 23వ తేదీన హైద్రాబాద్ నానక్ రామ్ గూడలో గ్యాస్ సిలిండర్ పేలుడుతో ఒకరు మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ ఘటనలో భవనం పూర్తిగా దెబ్బతింది. 2021 ఆగష్టులో హైద్రాబాద్ దూల్ పేటలో కూడ గ్యాస్ సిలిండర్ ఘటన చోటు చేసుకొంది.  అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్  చేస్తున్న సమయంలో ఈ గ్యాస్ సిలిండర్ పేలుడు చోటు చేసుకొంది

ఈ ఏడాది సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంగం మండలం మామిడిలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు చోటు చేసుకొంది. ఈ  ఘటన ఈ ఏడాది మే 21 వ తేదీన చోటు చేసుకొంది.ఈ సమయంలో  ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 

2021  హైద్రాబాద్ పాతబస్తీలోని మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడుతో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.  గాయపడిన వారంతా పశ్చిమ బెంగాల్ కు చెందిన వారు. బెంగాల్ రాష్ట్రం నుండి వచ్చిన వీరంతా  హైద్రాబాద్ లో స్వర్ణకారులుగా పనిచేస్తున్నారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios