హైదరాబాద్: రిజర్వేషన్లను అమలు చేసే కార్యక్రమాన్ని రాష్ట్రానికే వదిలేయాలని కేంద్రాన్ని కోరినట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. 

ముస్లింలకు రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ద్రవ్య వినిమయ బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎంఐఎం సభ్యులు అడిగిన రిజర్వేషన్ల అంశంపై ఆయన సమాధానమిచ్చారు.

also read:రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోంది: కేసీఆర్

మన పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో 69 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ 50 శాతం రిజర్వేషన్లు దాటొద్దని సుప్రీంకోర్టు చెబుతోందన్నారు.అయితే ఆయా రాష్ట్రాలకు ఉన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రిజర్వేషన్ల అమలుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

పాతబస్తీకి మెట్రో రైలును విస్తరించాలని ఎంఐఎం ఎమ్మెల్యే చేసిన వినతిపై ఆయన స్పందించారు. ఎవరి కారణంగా పాతబస్తీకి మెట్రో రైలు ఆలస్యమైందో అందరికీ తెలుసునని ఆయన సెటైర్లు వేశారు.