హైదరాబాద్‌లోని పలు కాలనీల్లో వెలసిన పబ్‌లు, కేఫేలు, బార్ అండ్ రెస్టారెంట్లు జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎన్ని ప్రమాదాలు జరిగినా.. ఎన్ని ఆందోళనలు చేసినా నిమ్మకునీరెత్తిన చందాన అధికారులు వ్యవహరిస్తున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
హైదరాబాద్‌లోని పలు కాలనీల్లో వెలసిన పబ్‌లు, కేఫేలు, బార్ అండ్ రెస్టారెంట్లు జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎన్ని ప్రమాదాలు జరిగినా.. ఎన్ని ఆందోళనలు చేసినా నిమ్మకునీరెత్తిన చందాన అధికారులు వ్యవహరిస్తున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో విషయం కోర్టుకు చేరింది. దాదాపు 10 పబ్‌లపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జనావాసాల మధ్య పబ్‌లు వున్నాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. డర్టీమార్టిన్, బ్రాడ్‌వే, మాకోబ్రూ వరల్డ్ కాఫీ, హాట్ కప్ కాఫీ, 800 జూబ్లీ, ఫర్జీ కేఫ్, అమ్నిషియా లాంజ్, హైలైఫ్, డైలీ డోస్‌బార్‌లపై ప్రజలు ఫిర్యాదు చేశారు.
కాగా.. ఇటీవల జూబ్లీహిల్స్‌లోని (jubilee hills) ఓ పబ్‌లోకి నలుగురు పిల్లలను అనుమతించింది యాజమాన్యం. పబ్‌లో ఓ వైపు ఫుల్‌గా మద్యం తాగి నృత్యాలు చేస్తుండగానే.. పిల్లలు పబ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సెల్ఫీలు దిగుతూ కనిపించారు. ఎక్సైజ్ శాఖ ఎన్ని దాడులు చేసినప్పటికీ .. ఎన్ని కథనాలు మీడియా ప్రసారం చేసినప్పటికీ పబ్‌ల తీరు మాత్రం మారడం లేదు. 21 సంవత్సరాల లోపు పిల్లలను, మైనర్లను పబ్‌లోకి అనుమతించకూడదని కఠిన నిబంధనలు వున్నాయి. అయినప్పటికీ నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు నిర్వాహకులు.
ALso Read:నిబంధనల బేఖాతరు.. హైదరాబాద్ పబ్బుల్లో ప్రత్యక్షమైన పిల్లలు, వీడియోలు వైరల్
అంతకుముందు నిబంధనలకు విరుద్దంగా నడుస్తోన్న టాలీవుడ్ పబ్‌పై (tollywood club) శనివారం వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులకు దిగారు. పబ్‌లో వికృత ఛేష్టలకు పాల్పడుతోన్న 9 మంది యువతులు, 34 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే పబ్‌లో సమయం దాటిన తర్వాత కూడా యువతి యువకులు అర్థనగ్న డ్యాన్స్‌లు చేస్తున్నారని సమాచారం. ఇటీవలే ఈ పబ్‌పై ఎక్సైజ్, పంజాగుట్ట పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి నోటీసులు జారీ చేశారు. అయితే గతంలోనూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా వుంది టాలీవుడ్ పబ్. ఇటీవలే పబ్‌కు వచ్చిన భార్యాభర్తలపై పబ్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో పాటు దాడి చేయడంతో కొంత కాలం సీజ్ చేశారు పంజాగుట్ట పోలీసులు.
