కరీంనగర్ శాతవాహన యూనివర్శిటీలో మరోసారి ఎలుగుబంటి కలకలం: రంగంలోకి రెస్క్యూ టీమ్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని శాతవాహన యూనివర్శిటీలో మరోసారి ఎలుగుబంటి కలకలం రేపుతుంది. మూడు మాసాల నుండి యూనివర్శిటీకి సమీపంలోనే చిట్టడవిలోనే ఎలుగుబంటి ఉందని అటవీశాఖాధికారులు అనుమానిస్తున్నారు.
కరీంనగర్: ఉమ్మడి Karimnagar జిల్లాలోని Satavahana Universityలో మరోసారి Bear కలకలం రేపుతుంది. మూడు మాసాల క్రితం కూడా ఇదే యూనివర్శిటీ క్యాంపస్ లో భల్లూకం కన్పించడంతో విద్యార్ధులు, సిబ్బంది భయాందోళనలు చేశారు. ఎలుగుబంటి కోసం గాలింపు చర్యలు చేపట్టినా కూడా అది కన్పించలేదు. అయితే మూడు రోజులుగా ఎలుగుబంటి ఆనవాళ్లు కన్పించాయి. దీంతో ఎలుగుబంటిని పట్టుకొనేందుకు అటవీశాఖాధికారులు ప్రయత్నాలను ప్రారంభించారు.
గత మూడు రోజులుగా రాత్రి పూట ఎలుగుబంటి సంచరిస్తున్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. శాతవాహన యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన సీసీకెమెరాల్లో ఎలుగుబంటి సంచరించిన దృశ్యాలు కూడా రికార్డయ్యాయి. యూనివర్శిటీలోని MBA కాలేజీ ముందున్న పూలకుండీలను ఎలుగుబంటి పగులగొట్టింది.ఈ దృశ్యాలు CCTVల్లో రికార్డయ్యాయి. మరో వైపు సాయంత్రం ఐదు గంటల తర్వాత విద్యార్ధులు, సిబ్బంది బయటకు రావొద్దని కూడా యూనివర్శిటీ అధికారులు హెచ్చరించారు. అంతేకాదు వాకర్స్ ను కూడా రావొద్దని కూడా శాతవాహన యూనివర్శిటీ అధికారులుసూచించారు.
ఎలుగుబంటి సంచరిస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. ఎలుగుబంటి సంచరిస్తున్న విషయాన్ని యూనివర్శిటీ అధికారలు అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం ఆధారంగా అటవీశాఖాధికారులు ఎలుగుబంటి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మూడు నెలలుగా శాతవాహన యూనివర్శిటీ పరిధిలోని చిట్టడవిలోనే ఎలుగుబంటి ఉందని ఫారెస్ట్ అధికారులు అనుమానిస్తున్నారు. చిట్టడవిలోని పొదలు, బండరాళ్ల వెనుక ఎలుగుబంటి ఉంటుందనే అనుమానంతో ఉన్నారు.
జిల్లాలోని కొత్తపూర్ మండలం Malkapur లో ఓ ఇంటి వద్ద మూడు రోజుల క్రితం ఎలుగుబంటి సంచరించింది. ఈ విషయాన్ని ఇంటి యజమాని అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చాడు. మూడు రోజులుగా ఇదే ప్రాంతంలో ఎలుగుబంటి సంచరిస్తుందని స్థానికులు అటవీశాఖాఁధికారులకు చెప్పారు. దీంతో యూనివర్శిటీ వద్ద ఉన్న చిట్టడవిలో ఎలుగుబంటి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అటవీ ప్రాంతం నుండి ఎలుగుబంటి ఆహారం కోసం బయటకు వచ్చి ఉండొచ్చని ఫారెస్ట్ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే మూడు నెలుగా యూనివర్శిటీకి అనుకొని ఉన్న చిట్టడవిలోనే ఎలుగుబంటి ఉంది.
also read:శ్రీకాకుళం: జనంపై దాడి చేసిన ఎలుగుబంటి మృతి
ఈ ఏడాది మార్చి మాసంలో యూనివర్శిటీ నీటి గుంట వద్ద భల్లూకం వచ్చింది. ఎలుగుబంటి యూనివర్శిటీలోకి వచ్చిన విషయాన్ని విద్యార్ధులు తమ సెల్ ఫోన్లలో రికార్డు చేసి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఫారెస్ట్ అధికారులు కొన్ని రోజుల పాటు ఎలుగుబంటి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఎలుగుబంటి ఆచూకీ లేకుండాపోయింది. మూడు రోజులుగా మరోసారి ఎలుగుబంటి కన్పించడంతో రెస్క్యూ టీమ్ భల్లూకం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కిడిసింగి తో పాటు పరిసర గ్రామాల్లో ఎలుగుబంటి కలకం రేపింది.ఈ ఏడాది జూన్ 21న ఎలుగుబంటిని అటవీశాఖాధికారులు బంధించారు. అంతకు ముందు మూడు రోజుల పాటు స్థానిక ప్రజలపై భల్లూకం దాడి చేసింది.ఎలుగు బంటి దాడిలో ఒకరు మరణించగా సుమారు 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఓ రేకులషెడ్డులో ఉన్న ఎలుగుబంటిని అటవీశాఖాధికారులు బంధించారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఎలుగుబంటిని బంధించారు.