విలేకరి, కూతుళ్ల మృతి, భార్య పరిస్థితి విషమం

సిద్దిపేట పట్టణంలోని శ్రీనగర్ కాలనీ విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ పత్రికలో విలేకరిగా పనిచేస్తున్న హన్మంతరావు అనే వ్యక్తి తన భార్యా, ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హనుమంతరావు-మీనా లు దంపతులు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. హన్మంతరావు కుటుంబంతో కలిసి సిద్దిపేటలో నివాసముంటూ కొండపాకలో ఓ ప్రముఖ దినపత్రిక లో విలేకరిగా పనిచేస్తున్నాడు.

అయితే ఇతడు ఇవాళ ఉదయం తన ఇతడు తన భార్యతో పాటు ఇద్దరు పిల్లలకు విషమిచ్చాడు. అనంతరం తాను కూడా ఇంట్లోని ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. దీంతో చిన్నారులు బిన్ను, మిన్నుతో పాటు హన్మంతరావు అక్కడికక్కడే మృతి చెందారు. అతడి భార్య మీనా పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు ఆమెను సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యలకు గల కారణాలకోసం దర్యాప్తు చేపట్టారు.