హైదరాబాద్: హెఎంటి వర్కర్స్, స్టాఫ్ యూనియన్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెసు నేత రేణుకా చౌదరి కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడు వివేకానందను ఓడించారు. శనివారంనాడు ఫలితాలు వెలువడ్డాయి.

మొత్తం 151 ఓట్లలో 141 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో రేణుకా చౌదరికి 79 ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యుడదు బోయినపల్లి వినోద్ కుమార్ స్థానంలో యూనియన్ అధ్యక్ష పదవిని రేణుకౌ చౌదరి చపట్టనున్నారు. 

వివేకానందకు 65 ఓట్లు వచ్చాయి. రేణుకా చౌదరిపై ఆయన 14 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. హెచ్ఎంటి యూనియన్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెసు నేతల్లో రేణుకౌ చౌదరి రెండోవారు. అంతకు ముందు వి. హనుమంతరావు హెఎంటి యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశారు.