Asianet News TeluguAsianet News Telugu

పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసు... వనమా రాఘవకు రిమాండ్ పొడిగింపు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ( palwancha suicide case) నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో నిందితుడిగా ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా  వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవకు మరో 14 రోజులు రిమాండ్‌ పొడిగించారు

remand extended for vanama raghavendar in palwancha suicide case
Author
Hyderabad, First Published Jan 22, 2022, 7:58 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ( palwancha suicide case) నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో నిందితుడిగా ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా  వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవకు మరో 14 రోజులు రిమాండ్‌ పొడిగించారు. ఫిబ్రవరి 4 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ కొత్తగూడెం రెండో అదనపు జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. రాఘవ రిమాండ్‌ గడువు ఇవాళ్టీతో ముగియడంతో పోలీసులు అతడిని వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు. తాజా ఆదేశాలతో రాఘవ మరో 14 రోజులు జైలులోనే  ఉండనున్నారు. 

మరోవైపు రామకృష్ణ కుటుంబం సూసైడ్ కేసులో కొత్తగూడెం ఎమ్మెల్యే vanama venkateshwara rao తనయుడు  vanama raghavendra rao కు  పోలీస్ శాఖలో ఎవరు సహకరించారనే విషయమై  ఆ శాఖ అంతర్గత విచారణను ప్రారంభించింది.  వనమా రాఘవేందర్ కు police శాఖ నుండి కూడా సహకారం ఉందనే విమర్శలు కూడా లేకపోలేదు.

ఉమ్మడి Khammam జిల్లాలోని పాల్వంచలో Ramakrishna కుటుంబం ఈ నెల 3న ఆత్మహత్యకు పాల్పడింది., రామకృష్ణ ఆయన భార్య  శ్రీలక్ష్మి, ఇద్దరు కూతుళ్లు సాహితీ, సాహిత్యలు ఆత్మహత్య చేసుకొన్నారు.  ఈ నెల 7 రాత్రి వనమా రాఘవేందర్ ను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలీసులు Arrest చేశారు. అయితే వనమా రాఘవేందర్ అరెస్ట్ చేసేందుకు పోలీసు ఉన్నతాధికారుల వ్యూహాలను నిందితుడికి సమాచారం చేరవేశారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. అయితే ఈ సమాచారాన్ని రాఘవేందర్ కు ఎవరు చేరవేశారనే విషయమై అంతర్గతంగా పోలీస్ శాఖ చేపట్టింది.

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకొన్న తర్వాత పాల్వంచ నుండి అదృశ్యమైన రాఘవేందర్  Hyderabad విశాఖ తదితర ప్రాంతాల్లో గడిపినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ సమయంలో  రాఘవేందర్ సిమ్ కార్డులను మార్చినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే రాఘవ ఉపయోగించిన Sim కార్డులకు పోలీస్ శాఖ నుండి ఎవరెవరు సమాచారం ఇచ్చారనే విషయమై ఉన్నతాధికారులు విచారణను ప్రారంభించారు.

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవేందర్ పై Ipc 302, 307,306 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.వనమా రాఘవేందర్ ఎక్కడెక్కడ తిరిగాడనే విషయమై కొందరు పోలీసులకు సమాచారం లభించిందనే విషయమై ప్రస్తుతం చర్చ సాగుతుంది. హైద్రాబాద్ లో అరెస్టైనట్టుగా తొలుత ప్రచారం సాగింది. అయితే ఈప్రచారాన్ని పోలీసులు కొట్టిపారేశారు. అయితే మరునాడే రాఘవేందర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అరెస్టయ్యాడు. 

రాఘవ సిమ్ కార్డులు మార్చడం వల్ల ఆయన ఎక్కడ ఉన్నాడనే విషయాన్ని గుర్తించడం కష్టంగా మారిందని కూడా కొందరు పోలీస్ ఉన్నతాధికారులు చెప్పారు. మరో వైపు రాఘవేందర్ రావు అనుచరులకు ఎక్కువగా ఏ పోన్ల నుండి ఫోన్లు వచ్చాయనే విషయమై పోలీసులు డేటాను సేకరించారు.ఈ data ఆధారంగా పోలీస్ శాఖ విచారణను ప్రారంభించింది. ఈ విచారణలో రాఘవేందర్ రావు కు సహకరించిందెవరనే విషయమై తేలనుంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios