మతం క్యాన్సర్ కంటే ప్రమాదమని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. హైద్రాబాద్ లో మూడు చోట్ల టిమ్స్ ఆసుపత్రులకు సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.

హైదరాబాద్: Religion క్యాన్సర్ కంటే ప్రమాదమని తెలంగాణ సీఎం KCR చెప్పారుమతం పిచ్చిలో పడితే మనం చాలా ప్రమాదంలో పడతామన్నారు. మతం అనే క్యాన్సర్ ను మనం తెచ్చుకోవద్దని ఆయన ప్రజలను కోరారు..మతం, కులం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆయన పరోక్షంగా BJP పై విమర్శలు చేశారు. అన్ని కులాలు మతాలను అనుసరించే దేశం మనదన్నారు. శాంతి, సామరస్యం , శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు, ఉద్యోగాలొస్తాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కులం, మతం పేరుతో గొడవలు పడితే మన కాళ్లను మనమే నరుక్కొన్నట్టేనని కేసీఆర్ చెప్పారు. కులం, మతం పేరుతో గొడవలు పడితే తాత్కాలికంగా ప్రయోజనం కల్గించినట్టుగా కన్పించినా కూడా దీర్థకాలికంగా నష్టమేనని ఆయన చెప్పారు

 ఫలానా దుకాణంలో ఫలానా వస్తువులు కొనుగోలు చేయవద్దని మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారన్నారు. విదేశాల్లో 13 కోట్ల మంది భారతీయులు పనిచేస్తున్నారన్నారు.వీరిని ఆయా ప్రభుత్వాలు వెనక్కి పంపితే వారికి ఎవరు ఉపాధి కల్పిస్తారని కేసీఆర్ ప్రశ్నించారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం లక్షల కోట్లు పెట్టుబడులు సాధించిందన్నారు. 

Hyderabad నగరంలో మూడు TIMS ఆసుపత్రులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. వైద్య విధానాన్ని పటిష్టం చేయడం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టినట్టుగా సీఎం కేసీఆర్ వివరించారు. రాష్ట్రంలో పార్టీలన్నీ రాజకీ సభలు నిర్వహిస్తుంటే మనమేమో వైద్యానికి సంబంధించిన సభ జరుపుకుంటున్నామని కేసీఆర్ చెప్పారు.

గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో పడకలు, సదుపాయాలను పెంచామన్నారు. ఎయిమ్స్ స్థాయిలో టిమ్స్ ఆసుపత్రులను నిర్మిస్తామని కేసీఆర్ చెప్పారు. ఇక్కడ బ్రహ్మాండమైన వైద్యం అందుతుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. గాంధీ, నిలోఫర్ ఆసుపత్రులకు వెళ్లే అవసరం లేకుండా హైద్రాబాద్ కు నలు వైపులా కూడా టిమ్స్ ఆసుపత్రులను నిర్మిస్తున్నట్టుగా కేసీఆర్ వివరించారు. రెండేళ్ల క్రితం గచ్చిబౌలిలో టిమ్స్ ను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం నిర్మించనున్న టిమ్స్ లో అన్ని విభాగాల్లో రోగులకు ఉచితంగా సేవలు అందించనున్నట్టుగా సీఎం కేసీఆర్ చెప్పారు.

తెలంగాణ సీఎం KCR మంగళశారం నాడు హైద్రాబాద్ లో మూడు TIMS ఆసుపత్రులకు శంకుస్థాపన చేశారు. కొత్తపేట, సనత్ నగర్, అల్వాల్ లో మూడు టిమ్స్ ఆసుపత్రలను నిర్మించనున్నారు. అల్వాల్ లో 28.41 ఎకరాల్లో రూ. 897 కోట్ల వ్యయంతో జీ+ 5 అంతస్థులతో టిమ్స్ Hospital ని నిర్మించనున్నారు. Sanath Nagar లో 17 ఎకరాల్లో రూ. 882 కోట్లతో జీ+ 14 అంతస్తులతో టిమ్స్ భవనాన్ని నిర్మించనున్నారు. గతంలో Kothapetలో ఫ్రూట్ మార్కెట్ ఉన్న స్థలంలో రూ.900 కోట్లతో జీ+ 14 అంతస్థులతో టిమ్స్ ను నిర్మించనున్నారు ఒక్కో ఆసుపత్రిలో వెయ్యి పడకలు ఏర్పాటు చేయనున్నారు. మంగళవారం నాడు అల్వాల్ లో ఈ మూడు ఆసుపత్రులకు సీఎం కేసీఆర్ భూమి పూజ నిర్వహించారు. రూ. 2,679 కోట్లతో ఈ మూడు ఆసుపత్రులను నిర్మించనున్నారు.