ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసిన ఇంక్యుబేటర్‌.. వేడి తట్టుకోలేక మృత్యువాత, ఆసుపత్రిపై బంధువుల దాడి

హైదరాబాద్ పాతబస్తీలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. ఇంక్యుబేటర్‌లో వేడి తట్టుకోలేక ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులు కేఏఎం ఆసుపత్రిపై దాడి చేశారు. 

relatives attack on kam hospitals in hyderabads old city over two children were killed when incubator overheated

హైదరాబాద్ పాతబస్తీలోని (hyderabad old city) కేఏఎం ఆసుపత్రిపై (kam hospitals) దాడులు చోటు చేసుకున్నాయి. మంగళవారం ఇదే ఆసుపత్రిలో ఇద్దరు చిన్నారులు మరణించిన ఘటన కలకలం రేపింది. ఇంక్యుబేటర్ (incubator) వేడికి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఆగ్రహించిన సదరు చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రిపై దాడికి దిగి.. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పిల్లల మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్ధితిని అదుపు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios