పసిడిని దాటిన ధర: వరంగల్ ఎనుమాములలో క్వింటాల్ మిర్చికి రూ. 90 వేలు


తెలంగాణలోని వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో క్వింటాల్ మిర్చికి రూ. 90వేలు పలికింది. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ధర రాలేదని రైతులు చెబుతున్నారు.

Red Chilli Gets All Time Record  Price At Enumamula Market

వరంగల్: మిర్చికి రికార్డు స్థాయి దర పలికింది. వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో క్వింటాల్ మిర్చికి రూ. 90వేల ధర పలికింది. మిర్చికి ఎనుమాముల మార్కెట్ యార్ఢులో గతంలో కూడా రికార్డు స్థాయి ధర పలికింది.ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్ ఎనుమాముల. ఈ మార్కెట్ లో మిర్చికి భారీగా ధర పలకడంతో రైతుల ఆనంధానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ ఏడాది మిర్చి దిగుబడి తక్కువగా ఉంది.దీంతో నాణ్యమైన  మిర్చికి భారీగా డిమాండ్ నెలకొంది.  ఈ  ఏడాది మార్చి మాసంలో మిర్చి పంట పసిడితో పోటీ పడింది. అయితే ఇప్పుడు పసిడిని మించిపోయింది.  క్వింటాల్ మిర్చి ధర రూ. 50వేల నుండి రూ. 90 వేలకు చేరింది. రిటైల్ మార్కెట్లో మిర్చి  ఇంకా పెరిగే అవకాశం ఉంది. 

ఈ ఏడాది మార్చి 30వ తేదీన ఎనుమాముల మార్కెట్ లో క్వింటాల్ మిర్చికి రూ. 52 వేలు ధర పలికింది. మార్చి 3న క్వింటాల్ మిర్చికి 32 వేలు పలికింది. ఆ తర్వాత రెండు రోజులకే మిర్చి ధర రూ. 35 వేలకు పెరిగింది. రూ.35 వేల ధర రూ. 40వేలు దాటింది. మార్చి 30వ తేదీ నాటికి ఈ ధర ఏకంగా రూ. 52 వేలను దాటింది. 

also read:పసిడితో పోటీకి మిర్చి ధర: వరంగల్‌ మార్కెట్‌లో క్వింటాల్ మిర్చికి రూ. 52 వేలు

తాజాగా క్వింటాల్ మిర్చికి రూ. 90వేలు ధర పలకడం రికార్డు. గతంలో ఎన్నడూ కూడ మిర్చికి ఇంత ధర పలకలేదని రైతులు చెబుతున్నారు. విదేశాల్లో కూడా మిర్చికి బాగా డిమాండ్ ఉంది. వర్షఁాలు, వైరస్ కారణంగా ఈ ఏడాది మిర్చి దిగుబడి తగ్గింది. ఈ కారణాలతో మిర్చికి డిమాండ్ పెరిగింది. అదే సమయంలో నాణ్యమైన మిర్చికి అధిక ధర చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఈ కారణాలతో మిర్చికి ధరలు పెరిగిపోతున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios