హైద్రాబాద్ ఎల్బీనగర్ కు చెందిన రియల్టర్ భాను హత్యకు గురయ్యాడు. మూడు రోజుల తర్వాత  భాను ఖమ్మంలో శవంగా తేలాడు. కిడ్నాప్ చేసి భానును హత్య  చేశారని అనుమానిస్తున్నారు.Telangana News:


హైదరాబాద్: నగరంలోని ఎల్బీ నగర్ కి చెందిన Realtor ఏస్టేట్ వ్యాపారి Bhanu అదృశ్యమైన మూడు రోజుల తర్వాత ఖమ్మంలో శవమై తేలాడు. భానును Kidnap చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఎల్బీనగర్ నాగోల్ వద్ద భాను నివాసం ఉంటాడు. రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. 

మూడు రోజులుగా ఆయన కన్పించకుండా పోయాడు. ఈ నెల 21 ఖమ్మం జిల్లాలోని మూలగూడెం వద్ద Nagarjuna Sagar ప్రధాన కాలువలో భాను డెడ్ బాడీ లభ్యమైంది. అయితే ఈ డెడ్ బాడీని గుర్తు తెలియనిదిగా police తొలుత భావించారు. రాష్ట్ర వ్యాప్తంగా మిస్సింగ్ కేసులకు సంబంధించి నమోదైన కేసుల విషయమై పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. ఎల్బీ నగర్ పోలీసులు ఖమ్మంకి వచ్చారు చేతి వేలుకు ఉన్న ఉంగరం ఆధారంగా భానును గుర్తించారు.