ఆయనతో సన్నితంగా ఉండే విజయభాస్కర్‌రెడ్డి గురూజీని విమర్శిస్తుండటంతో పాటు పరుషపదజాలం వాడేవారట. ఈ కారణంగానే ఆయనను నిందితులు చంపినట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్ నగరంలో ఓ రియల్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆయన పరుష పదజాలం వాడటం కారణంగానే హత్యకు గురవ్వడం గమనార్హం. ఓ గూరుజీని దూషిస్తూ, విమర్శించిన కారణంగానే ఆయన హత్యకు గురయ్యారు. ఈ సంఘటన నగరంలో నే చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కేపీహెచ్‌పీ ప్రాంతానికి చెందిన రియల్టర్‌ విజయభాస్కర్‌రెడ్డి ని ఇటీవల కొందరు కిడ్నాప్ చేసి హత్య చేశారు. కాగా.. ఆయన నెల్లూరుకు చెందిన ఓ గూరుజీని దూషించడం గమనార్హం. నెల్లూరు జిల్లా కావలికి చెందిన గురూజీ మూలికా వైద్యంలో సిద్ధహస్తుడని, దీర్ఘకాలిక రోగాలకు వైద్యం చేసేవాడు. ఈ గురూజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో భక్తులు కూడా ఉన్నారు.

అయితే.. ఆయనతో సన్నితంగా ఉండే విజయభాస్కర్‌రెడ్డి గురూజీని విమర్శిస్తుండటంతో పాటు పరుషపదజాలం వాడేవారట. ఈ కారణంగానే ఆయనను నిందితులు చంపినట్లు తెలుస్తోంది. 

ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన నలుగురు నిందితులను పోలీసులు తమ కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. మాజీ ఆర్మీ ఉద్యోగి నాగర్‌ కర్నూల్‌కు చెందిన మల్లేష్‌, విజయవాడకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి సుధాకర్‌బాబు, హైదరాబాద్‌ బోరబండకు చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్‌ శ్రావణ్, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కృష్ణంరాజులను సోమవారం వరకు విచారించనున్నారు. ఈ కేసులో సూత్రధారిగా అనుమానిస్తున్న త్రిలోక్‌నాథ్‌ అలియాస్‌ గురూజీ కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.