భువనగిరి: పట్టపగలు తెలంగాణలోని యాదాద్రి జిల్లా భువనగిరిలో ఓ రియల్టర్ పై హత్యాయత్నం జరిగింది. ఇంట్లోకి చొరబడి దుండగుడు అతనిపై వేటకొడవళ్లతో శనివారంనాడు దాడి చేశాడు.

సురేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిపై జరిగిన ఈ దాడి జరిగింది. రియల్ ఎస్టేట్ తగాదాలే దీనికి కారణమని అనుమానిస్తున్నారు. ఇటీవలి కాలంలో యాదాద్రి పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంది. యాదగిరి గుట్ట లక్ష్మినరసింహ స్వామి ఆలయ పరిసరాలను పెద్ద యెత్తున అభివృద్ధి చేస్తుండడంతో స్థలాల ధరలు విపరీతంగా పెరిగాయి.

ఐపిఎల్ బెట్టింగ్ కూడా దాడికి కారణమై ఉండవచ్చునని భావిస్తున్నారు. సిసిటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అతని కోసం గాలిస్తున్నారు. అతను శివ అనే వ్యక్తి అయి ఉండవచ్చునని అంటున్నారు. 

సురేష్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆయనను హైదరాబాదుకు తరలించారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.