Asianet News TeluguAsianet News Telugu

ఎట్టకేలకు పోలీసుల ముందుకొచ్చిన రవిప్రకాష్

హైదరాబాద్: సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ మంగళవారం నాడు హాజరయ్యారు

ravi prakash attends before ccs police in hyderabad
Author
Hyderabad, First Published Jun 4, 2019, 4:40 PM IST

హైదరాబాద్:సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ మంగళవారం నాడు హాజరయ్యారు. 41 ఏ నోటీసు కింద పోలీసుల విచారణకు హాజరుకావాల్సిందేనని సోమవారం నాడు  సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో ఇవాళ రవిప్రకాష్ సైబర్ క్రైమ్ పోలీసుల  ఎదుట హాజరయ్యారు.

అలంద మీడియా సంస్థ ఏబీసీఎల్ లో సుమారు 90 శాతం పైగా వాటాను కొనుగోలు చేసింది. ఈ విషయంలో కొత్త యాజమాన్యానికి రవిప్రకాష్ సహకరించలేదని కొత్త యాజమాన్యం తరపున కౌశిక్ రావు ఆరోపించారు. అంతేకాదు కొత్త యాజమాన్యానికి సహకరించకుండా రవిప్రకాష్ ఫోర్జరీ చేశాడని కౌశిక్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ ఫిర్యాదు ఆధారంగా రవి ప్రకాష్ పై కేసులు నమోదు చేశారు. టీవీ9 లోగోను మోజో టీవీకి విక్రయించినట్టుగా కూడ రవిప్రకాష్ తప్పుడు పత్రాలను సృస్టించారని కూడ కొత్త యాజమాన్యం ఆయనపై కేసు పెట్టింది.

ఈ కేసుల విషయంలో  రవిప్రకాష్ ఇల్లుతో పాటు టీవీ9 కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించి కీలకమైన డాక్కుమెంట్లను స్వాధీనం చేసుకొన్నారు. ఈ కేసులు నమోదైనప్పటి నుండి రవిప్రకాష్ కన్పించకుండా పోయాడు. 

హైకోర్టులో మూడు దఫాలు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో  సుప్రీంకోర్టును ఆయన ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో సోమవారం నాడు రవిప్రకాష్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదించారు.

పోలీసుల విచారణకు హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులోనే పిటిషన్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు రవిప్రకాష్ కు సూచించింది. దీంతో మంగళవారం నాడు రవిప్రకాష్ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

విచారణకు హాజరుకావాల్సిందే: రవిప్రకాష్‌కు సుప్రీం ఆదేశాలు

Follow Us:
Download App:
  • android
  • ios