రౌడీషీట్ ఎత్తేశారని ఆనందం.. స్నేహితులకు అమ్మాయిలతో కలిసి రేవ్ పార్టీ.. 48మంది అరెస్ట్..!!
తనమీద రౌడీషీట్ ఎత్తేశారన్న సంతోషంలో స్నేహితులకోసం రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడో రౌడీషీటర్.. విషయం పోలీసులకు తెలియడంతో మళ్లీ అరెస్ట్ అయ్యి జైలుకెళ్లాడు.
హైదరాబాద్ : రౌడీషీట్ ఎత్తేసిన సంతోషంలో ఓ మాజీ రౌడీషీటర్ శనివారం రాత్రి తన స్నేహితులకు యువతులతో కలిసి రేవ్ పార్టీని ఏర్పాటు చేశాడు. ఈ పార్టీని శంషాబాద్ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ టీం భగ్నం చేసింది. 48మందిని అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఇన్ స్పెక్టర్ ఎ.శ్రీధర్ కుమార్, ఎస్ఓటీ ఇన్ స్పెక్టర్ కె. వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మైలార్ దేవ్ పల్లికి చెందిన బాబాఖాన్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో అతని మీద రౌడీషీట్ తెరిచారు.
ఇటీవల అతని మీద నమోదైన రౌడీషీట్ ను ఉన్నతాధికారులు తొలగించారు. ఈ సంతోషంలో తన స్నేహితులకు శంషాబాద్ రామాంజపూర్ లోని సలీం వ్యవసాయ క్షేత్రంలో బాబాఖాన్ రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు. దీనిపై పోలీసులు దాడి చేశారు. నలుగురు రౌడీషీటర్లు, 44మంది యువతీ యువకులను అరెస్ట్ చేశారు. వారి నుంచి కత్తులు, హుక్కా పరికరాలు, ఫోన్లు, టూ వీలర్లు, కార్లు, స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
అక్కడ నోటాకు రెండో స్థానం.. ఇక్కడ కేఏ పాల్‌కు ఓట్లెన్నో తెలుసా?
కాగా, తమ స్నేహితుడి మీద రౌడీ షీట్ ను పోలీసులు మూసివేసినందుకు సంబరాలు చేసుకోవడానికి ఫామ్‌హౌస్‌లో ముజ్రా పార్టీ ఏర్పాటు చేసిన నలుగురు రౌడీ షీటర్లతో పాటు 44 మందిని శంషాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. తెల్లవారుజామున 3 గంటలకు సైబరాబాద్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ శంషాబాద్ నర్కూడ గ్రామ శివారులో ఒక ముజ్రా పార్టీ జరుగుతుందన్న సమాచారంతో ‘సలీమ్ ఫామ్ హౌస్’పై దాడి చేసింది.
పోలీసులు 48 మంది సభ్యులను, నలుగురు హిజ్రాలను పట్టుకున్నారు. వారినుంచి 4 కత్తులు, 5 హుక్కాలు, 49 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు చెందిన బాబాఖాన్ అనే మాజీ రౌడీషీటర్ కు చెందిన ఫామ్‌హౌస్ అని, ఇటీవల తనమీద రౌడీషీట్‌ను మూసివేసిన నేపథ్యంలో తన స్నేహితుల కోసం ఫామ్‌హౌస్‌లో ముజ్రా పార్టీ ఏర్పాటు చేశాడని సైబరాబాద్ ఎస్‌ఓటీ అదనపు డీసీపీ నారాయణ తెలిపారు. ఈ పార్టీలో నలుగురు రౌడీ షీటర్లు యాసీన్, మహబూబ్, అజరు, సోహైల్ కూడా పాల్గొన్నారు. విచారణ నిమిత్తం నిందితులను శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.