బిజెపి నుంచి ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వరంగల్ నగర నాయకురాలు రవళి కూచనకు కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు కట్టబెట్టింది. ఆమెకు పిసిసి అధికార ప్రతినిధి పదవిని అప్పగించారు.

రవళి బిజెపిలో ఉన్నా.. నేడు కాంగ్రెస్ లో ఉన్నా.. అధికార టిఆర్ఎస్ పార్టీ పనితీరుపైనే పోరాటం చేశారు. టిఆర్ఎస్ వైఫల్యాల మీద బిజెపి అనుకున్న రీతిలో ప్రజా ఆందోళనలు చేయడంలేదన్న ఆవేదనతోనే ఆమె బిజెపిని వీడి కాంగ్రెస్ లో చేరినట్లు గతంలో ప్రకటించారు.

రవళికి పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నియామకపత్రాన్ని అందజేశారు. పిసిసి మీడియా ఇన్ఛార్జి డాక్టర్ మల్లు రవి నియామక లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల పాత్ర పోశించాలని వారు ఆకాంక్షించారు.