ఆత్మహత్య చేసుకున్న ఓ వ్యక్తి డెడ్ బాడీని భద్రపర్చడంలో భువనగిరి గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. డెడ్ బాడీని మార్చురీ గదిలో ఎలుకలు కొరికాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

మార్చురీలో భద్రపర్చిన మృతదేహాన్ని ఎలుకలు కొరికిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ లో చోటు చేసుకుంది. ‘ఈనాడు’ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని పల్నాడు జిల్లాకు యడ్లపాడు మండలానికి చెందిన పెరికెల రవిశంకర్ అనే వ్యక్తి భువనగిరిలో నివసిస్తున్నాడు. సిటీలోని ప్రగతినగర్ లో తన తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. అయితే కొంత కాలం నుంచి ఆయన మద్యానికి బానిస అయ్యాడు.

మహిళతో యువకుడి వివాహేతర సంబంధం.. బట్టలూడదీసి, మర్మాంగాలు, నాలుకపై వాతలు పెట్టిన స్నేహితులు..

ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం భువనగిరి గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడి సిబ్బంది డెడ్ బాడీని మార్చురీలో భద్రపరిచారు. అయితే పోస్టుమార్టం కోసం రెడీ చేస్తున్న సమయంలో రవిశంకర్ ముఖంపై అక్కడక్కడా ఎలుకలు కొరినట్టు గుర్తులు ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు.

Khairatabad: ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్‌!.. దానం నాగేందర్‌కు లైన్ క్లియర్.. మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయం

మార్చురీ గదిలో డెడ్ బాడీని ఫ్రీజర్ లో ఉంచకుండా సిబ్బంది నిరక్ష్యంగా వ్యవహరించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే డెడ్ బాడీని హాస్పిటల్ కు తీసుకొచ్చిన సమయంలో ముఖంపై గాట్లు ఉన్నాయని ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్‌ చిన్ననాయక్‌ ‘ఈనాడు’ తెలిపారు. కాగా.. డెడ్ బాడీని మార్చురీకి తీసుకెళ్లిన సమయంలో ముఖంపై ఎలాంటి గాయాలు, గాట్లు కనిపించలేదని భవనగరి టౌన్ ఇన్ స్పెక్టర్ సుధీర్‌కృష్ణ చెప్పారు.