నా కొడుకు జర్మనీ పోతుంటే బిజీగా ఉండాల్సి వచ్చింది అయినా వాళ్లు వచ్చారని తెలిసి నేను ఆఫీసుకు పోయిన అప్పటికే వాళ్లు ఆత్మహత్యాయత్నం చేసిర్రు ఆరెపల్లి మోహన్ భూకబ్జాలు చేసింది నిజం కాదా?

తన నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినవారు కోలుకుంటున్నారని రసమయి బాలకిషన్ చెప్పారు. అందులో ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేయలేదని ఒకరే ఆ ప్రయత్నం చేయగా ఇంకో యువకుడు దాన్ని ఆపేందుకు ప్రయత్నించి గాయపడ్డాడని తెలిపారు. మహాంకాలి శ్రీనివాస్ ని కాపాడే ప్రయత్నంలో పర్శరాములు గాయపడ్డాడని రసమయి స్పష్టం చేశారు.

రాష్ట్రంలో మానకొండూర్ నియోజకవర్గంలోనే అత్యదికంగా భూములు కొనుగోలు చేసి., దళితులకు పంపిణీ చేశామని ప్రకటించారు. భూములు కొనుగోలు చేయడం ఆశామాషి కాదన్నారు. భూములు కొనుగోలు, పంపిణీ విషయాలను ఎమ్మేల్యే చూడరని, అధికారులే చూస్తారని తెలిపారు రసమయి.

ఆ ఘటన జరిగిన రోజూ ఎవరూ తనకు ఫోన్ చేయలేదన్నారు. ఆరోజు ఆదివారం కావడం, పైగా తన కుమారుడు జర్మనీ వెళుతున్నందున నేను బిజీగా ఉండాల్సివచ్చిందని వివరణ ఇచ్చారు. అప్పటికి కూడా బాధితులను కలిసేందుకు బయలుదేరానని చెప్పారు. ఈలోపే ఘటన జరిగిందన్నారు.

ఆ ఘటన జరిగిన రోజు కాంగ్రెస్ నేత ఆరేపల్లి మోహన్ అత్యుత్సాహం ప్రదర్శించాడని ఎద్దేవా చేశారు. దళిత నాయకుడై ఉండి కూడా వైద్యం జరగకుండా ఆసుపత్రిలో రాజకీయాలు చేయడం దారుణమన్నారు. తిమ్మాపూర్ బస్టాండ్ వద్ద ఉన్న భూమి కబ్జా చేసింది ఆరేపల్లి మోహన్ కాదా అని ప్రశ్నించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి